Hyderabad: ఏకంగా 163 మంది సీఐలు ట్రాన్స్ ఫర్, ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ సీపీ
Hyderabad 163 inspectors Transfer: ఏకంగా 163 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ కమిషనర్సీవీ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Transfer of 163 inspectors: తెలంగాణలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్ పెక్టర్లు బదిలీ అయ్యారు. ఏకంగా 163 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ కమిషనర్సీవీ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గనిర్దేశకాలను దృష్టిలో ఉంచుకుని సీఐలను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్అమల్లోకి రావటానికి ముందే పోలీసుల బదిలీలు జరిగిపోవాలని ఈసీ సూచించింది. సబ్ ఇన్ స్పెక్టర్ మొదలుకుని ఐపీఎస్ అధికారుల వరకు ట్రాన్స్ ఫర్ చేయాలని ఎన్నికల కమిషన్ మార్గనిర్దేశకాలు రావడంతో ఒకేసారి భారీ సంఖ్యలో 163 మంది సీఐలను ట్రాన్స్ ఫర్ చేశారు సీపీ.
తాజా బదిలీలు పరిశీలిస్తే.. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ గా నరేష్, ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ గా ప్రసాద్ రావు, మారేడ్ పల్లి ఇన్స్పెక్టర్ గా తిమ్మప్ప , నల్లకుంట ఇన్స్పెక్టర్ గా జగదీశ్వర్ రావు ట్రాన్స్ ఫర్ అయ్యారు. సీఐల బదిలీలకు సంబంధించి సీపీ సీపీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Complying the guidelines issued by the Election Commission on transfer of police officers, over 163 inspectors were transferred in Hyderabad City Police Commissionerate, and the orders were issued by the City Police Chief Mr. CV Anand in this regard and...https://t.co/lZ8fv0Auo6 pic.twitter.com/WZWdnKOdD3
— Hyderabad City Police (@hydcitypolice) July 30, 2023
పోలీసు అధికారుల బదిలీపై సోషల్ మీడియాలో పోస్ట్..
ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్‌లో 163 మందికి పైగా ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీస్ సోషల్ మీడియాలో ఈ వివరాలు పోస్ట్ చేశారు. బదిలీ అయిన పోలీసులు వారి కొత్త ప్రదేశాలలో రిపోర్టు చేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల హైదరాబాద్ సిటీ పోలీసు రీ ఆర్గనైజేషన్ అనంతరం ఈ స్థాయిలో బదిలీలు జరగడం పెద్ద విషయం అన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా (SHO), ఇతర కీలక పోస్టులకు ఇన్స్ పెక్టర్లను నిర్ణయించారు.
సీఐల బదిలీ అనంతరం అందరు ఇన్‌స్పెక్టర్లు, పై స్థాయి అధికారులతో సీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఇతర పోలీసు విభాగాల నుంచి పలువురు కొత్త అధికారులకు పోస్టింగ్ ఇచ్చినందున, మెగా సిటీ పోలీసింగ్ ప్లాన్‌లో భాగంగా చేసిన మార్పుల గురించి ఆయన వారికి వివరించారు. సీఐలకు బదిలీ అనంతరం పరిస్థితులు, పాలనాపరమైన సమస్యల గురించి వివరించారు. అప్పగించిన పనులకు ఏ లోపం లేకుండా చేయాలని ఆదేశాలు ఇచ్చారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో వారి సహకారం మరువలేనిది అన్నారు. హైదరాబాద్ పోలీసింగ్‌పై త్వరగా అవగాహన పెంచుకుని మంచి సేవలు అందించాలని సీపీ ఆనంద్ నూతన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఇన్‌ఫ్రా, మ్యాన్ పవర్, కొత్త యూనిట్లు లాంటి అన్ని విధాలుగా నగర పోలీస్ వ్యవస్థలో మార్పులు చేశామన్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial