News
News
X

Car Accident: 180 కి.మీ. స్పీడ్‌తో దూసుకొచ్చిన కారు, రెప్పపాటులో ఘోరం - వీడియో

ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ వీడియో కూడా బయటకు వచ్చింది. కనురెప్ప పాటులో కారు జారుకుంటూ దూసుకుపోయింది.

FOLLOW US: 
Share:

హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇందులో ప్రాణ నష్టం ఏమీ జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పిట్లుగా భావిస్తున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 7) తెల్లవారు జామున అతి వేగంగా వచ్చిన కారు షాప్ ల పైకి దూసుకెళ్లడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. తెల్లవారు జామున కావడంతో ఉదయం కాలినడక చేస్తున్న వారికి తృటిలో ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 180 స్పీడ్ లో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. కారులో ముగ్గురు యువకులు ఉన్నట్లు, వారు మద్యం మత్తులో అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కారులోని వారికి తీవ్ర గాయలు కావడంతో ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ నుండి పరారైనట్లు ప్రతక్ష సాక్షులు చెపుతున్నారు. కారులోని సీట్ లలో, బయట రక్తపు మరకలు ఎక్కువగా ఉండటంతో లోపలి వారికి గాయాలు ఎక్కువగా అయినట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు. కారులోని యువకులు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నడిపిన యువకులు ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ వీడియో కూడా బయటకు వచ్చింది. కనురెప్ప పాటులో కారు జారుకుంటూ దూసుకుపోయింది. 180 కిలో మీటర్ల వేగంలో ఉండగా బ్రేకు వేయడంతో కారు రోడ్డుపై జారుకుంటూ వెళ్లిపోయిందని భావిస్తున్నారు.

పెంబర్తిలో ముగ్గురు మృతి

పెంబర్తి సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. జనగామ మండలం పెంబర్తి జాతీయ రహదారిపైన ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. కారులోని ఓ చిన్నారికి కూడా ప్రాణాలు కోల్పోయింది. డీసీఎం పంక్చర్ కావడంతో టైరు మారుస్తుండగా ఘటన జరిగింది. కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఆరేళ్ల పాప మృతి చెందింది.

హైదరాబాద్ కొండాపూర్‌కు చెందిన మిర్యాల దేవేందర్ రెడ్డి కుటుంబం తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులో తిరుపతికి వెళ్లిన వీరు కాజీపేటలో దిగి కారులో హైదరాబాద్ కు వెళుతుండగా నిద్ర మత్తు, పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కార్ డోర్ ఓపెన్ అయి కింద పడి ఆరేళ్ళ పాప శ్రీహిత చనిపోయింది. ఆ కారు మీద పడడంతో డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న దేవేందర్ రెడ్డి ఆయన భార్య శ్రీవాణికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Published at : 07 Feb 2023 11:30 AM (IST) Tags: Hyderabad News Car accident in Vanasthalipuram car 180 kms speed pembarthi car accident NGOs colony accident

సంబంధిత కథనాలు

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

గ్రీన్ హైదరాబాద్ దిశగా కీలక అడుగులు - GHMC స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన అంశాలివే!

గ్రీన్ హైదరాబాద్ దిశగా కీలక అడుగులు -  GHMC స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన అంశాలివే!

TSPSC Issue: టీఎస్పీఎస్సీ దగ్గర వాల్‌పోస్టర్ల కలకలం! జిరాక్స్ సెంటర్ అంటూ ఎద్దేవా, కీలక డిమాండ్లు

TSPSC Issue: టీఎస్పీఎస్సీ దగ్గర వాల్‌పోస్టర్ల కలకలం! జిరాక్స్ సెంటర్ అంటూ ఎద్దేవా, కీలక డిమాండ్లు

టాప్ స్టోరీస్

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!

షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!

Ugadi 2023: ఉగాది అంటే అందరికీ పచ్చడి, పంచాంగం: వాళ్లకు మాత్రం అలా కాదు!  

Ugadi 2023: ఉగాది అంటే అందరికీ పచ్చడి, పంచాంగం: వాళ్లకు మాత్రం అలా కాదు!  

Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?

Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?