అన్వేషించండి

Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ఘటన.. పోలీసుల అదుపులో సాజిద్- బిల్డర్‌గా మారిన మెకానిక్

Building Collapse | గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో 48 గజాల్లో అక్రమంగా నిర్మించిన ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతిచెందగా, బాధ్యుడైన బిల్డర్ సయ్యద్ సాజిద్‌ను రాయదర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్ అంజయ్యనగర్‌లో అక్రమ ఏడంతస్తుల భవనం కూలి, ఇద్దరు మృతి.
  • బిల్డర్ సాజిద్ అక్రమ కట్టడాలకు పాల్పడి, పోలీసుల అదుపులో ఉన్నాడు.
  • టౌన్‌ప్లానింగ్ అధికారి సస్పెండ్; సాజిద్ సహకరించినవారిపై విచారణ.

Hyderabad Building Collapse | హైదరాబాద్‌లోని అంజయ్యనగర్‌లో కేవలం 38 గజాల సొంత స్థలానికి మరో 10 గజాల నాలాను ఆక్రమించి, మొత్తం 48 గజాల పరిధిలోనే ఏడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. సరైన పునాదులు, ఇంజినీరింగ్ ప్రణాళికలు లేకుండా నిర్మిస్తున్న 7 అంతస్తుల బిల్డింగ్ శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి బాధ్యుడైన బిల్డర్ సయ్యద్ సాజిద్ కట్టినవన్నీ అక్రమ నిర్మాణాలేనని తెలుస్తోంది.

శనివారం నాడు ఒకవైపు బిల్డింగ్ నేలమట్టమై ప్రాణనష్టం జరగగా, అదే ప్రాంతంలో తాను నిర్మిస్తున్న మరొక అక్రమ భవనానికి ఆరో అంతస్తు స్లాబ్ పనులు చేయిస్తూ బిల్డర్ సాజిద్ నిశ్చింతగా ఉన్నాడని అధికారులు గుర్తించారు. ప్రమాద తీవ్రతను తెలుసుకున్న వెంటనే అతడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ రాయదుర్గం పోలీసులు సాజిద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

బిల్డర్‌గా మారిన కారు మెకానిక్

గతంలో తండ్రి వద్ద కారు మెకానిక్‌గా పనిచేసిన సాజిద్, గత 4 ఏళ్లుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో భూ ఆక్రమణలకు పాల్పడడం ప్రారంభించాడు. కబ్జాదారులతో చేతులు కలిపి పేద, అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి ఇళ్ల స్థలాలను తక్కువ ధరకు లాక్కునేవాడని ఆరోపణలు వస్తున్నాయి. ఆపై అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా బిల్డింగ్స్ నిర్మించి అమ్మేయడం అతనికి అలవాటుగా మారిందని తెలుస్తోంది. గత మూడేళ్లలోనే 5 బిల్డింగ్స్ నిర్మించిన బిల్డర్ సాజిద్, అధికారులకు లంచాలు మళ్లించడంతో వారు ఇతని అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి.

ప్రభుత్వ స్థలాలను, కాలనీ పార్కును కూడా ఆక్రమించి 7 అంతస్తుల భవనాలు నిర్మిస్తూ రూ.కోట్లు సంపాదించిన సాజిద్, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా హాస్టళ్లు, నివాస భవనాలు కడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. అంజయ్యనగర్‌లో బిల్గింగ్ కూలి ఇద్దరు కార్మికులు చనిపోయిన ఘటనతో సాజిద్ అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. సాజిద్‌కు సహకరిస్తున్నది ఎవరు, ఎవరెవరితో కలిసి ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపడతున్నాడనే దానిపై హైడ్రా, పోలీసులు విచారణ చేపట్టారు.

పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారంటే..

అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమైన మాదాపూర్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారి సంతోష్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి, బిల్డర్‌ సయ్యద్‌ సాజిద్‌, కాంట్రాక్టర్లపై 105 BNS సెక్షన్‌ కింద నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేసి సాజిద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ప్రమాద స్థలంలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. ఆ బిల్డింగ్ కూలిన సమయంలో శిథిలాలు పడటంతో పక్కనున్న అపార్ట్‌మెంట్‌లోని 10 ఫ్లాట్స్‌ దెబ్బతినడంతో, ప్రమాదకరంగా మారిన దాన్ని కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధమైంది. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమోనని గాలింపు ముమ్మరం చేశారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేంది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

Frequently Asked Questions

హైదరాబాద్‌లో ఏ ప్రాంతంలో భవనం కూలిపోయింది?

హైదరాబాద్‌లోని అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

కూలిన భవనం బిల్డర్ ఎవరు?

కూలిన భవనం బిల్డర్ సయ్యద్ సాజిద్. ఇతను గతంలో కారు మెకానిక్‌గా పనిచేసి, గత 4 ఏళ్లుగా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నాడు.

బిల్డర్ సాజిద్ ఎన్ని గజాల్లో అక్రమంగా భవనం నిర్మించాడు?

సాజిద్ తన 38 గజాల సొంత స్థలానికి మరో 10 గజాల నాలాను ఆక్రమించి, మొత్తం 48 గజాల పరిధిలో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించాడు.

ఈ ఘటనపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు?

మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. బిల్డర్ సాజిద్‌ను అరెస్ట్ చేసి నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

YS Sharmial Daughter Wedding: వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం.. నేడు క్రిస్టియన్, రేపు హిందూ సంప్రదాయంలో పెళ్లి!
వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం.. నేడు క్రిస్టియన్, రేపు హిందూ సంప్రదాయంలో పెళ్లి!
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget