By: ABP Desam | Updated at : 04 Jun 2023 05:14 PM (IST)
తెలంగాణకు అగ్ర స్థానంపై మంత్రి కేటీఆర్ హర్షం (Photo: Twitter)
Telangana Haritha Haaram : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలలో ముఖ్యమైనది హరితహారం కార్యక్రమం. రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచాలని, పచ్చదనాన్ని పెంపొందించే అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందని తీసుకున్న నిర్ణయాలు ఫలితాన్నిస్తున్నాయి. ఇదే ఇప్పుడు రాష్ట్రానికి మరో ఘనతను తెచ్చిపెట్టింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఓ బుక్‌ను విడుదల చేసింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ విడుదల చేసిన తాజా పుస్తకంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.
తెలంగాణ పచ్చదనంతో నిండాలని, అందరికీ ప్రయోజనం చేకూరుతుందన్న ఉద్దేశంతో హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు సీఎం కేసీఆర్. దాని ఫలితంతో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ విడుదల చేసిన బుక్ లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 7,213 పాయింట్లతో తెలంగాణ తొలి స్థానం కైవసం చేసుకోగా, పెరిగిన అడవుల శాతం, మున్సిపల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లోనూ తెలంగాణ మొదటి ర్యాంకులో నిలిచింది. హరితహారం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అరుదైన ఘనత సాధించడంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిందన్నారు. సీఎం కేసీఆర్ విజన్, ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయని ట్వీట్ చేశారు.
Great news for Telangana 😊
— KTR (@KTRBRS) June 4, 2023
On the eve of the world environmental day, the latest book released by Centre for Science and Environment (CSE) Telangana state stands a clear Number One among all indian states 👏
Kudos to visionary leadership of CM KCR Garu and his brainchild… pic.twitter.com/02SSU6rvEm
7 పాయింట్లు పైగా సాధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ తరువాత గుజరాత్ 6.593, గోవా 6.394, మహారాష్ట్ర 5.764, హర్యానా 5.578 పాయింట్లతో టాప్ 5లో నిలిచాయి. ఏపీ 5.567 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది.
సెప్టెంబరు 29 నుంచి బీఫార్మసీ తరగతులు ప్రారంభం, జేఎన్టీయూ అకడమిక్ క్యాలెండర్ విడుదల
MLA Raja Singh: ఒవైసీకి దమ్ముంటే నాపై పోటీ చేయాలి, ఆయన తమ్ముడైనా ఓకే: రాజాసింగ్
Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!
TS TET 2023 Results: టీఎస్ టెట్-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం
Salaar Release : డిసెంబర్లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?
/body>