అన్వేషించండి

LB Nagar Metro Station: ఎల్బీనగర్‌లో భారీ ట్రాఫిక్ జామ్.. జాతరను తలపించేలా మెట్రో స్టేషన్ల వద్ద రద్దీతో ఇబ్బందులు

Traffic Jam At  LB Nagar | సొంతూళ్ల నుంచి అంతా హైదరాబాద్‌కు తిరిగి రావడంతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా ఎల్బీనగర్ వద్ద రోడ్లపై ట్రాఫిక్, మెట్రో స్టేషన్లోనూ అదే సీన్ కనిపించింది.

Traffic Jam At  LB Nagar Metro Station | ఎల్బీనగర్: హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‌ ఏరియాలో ఆదివారం ఉదయం నుంచి భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దసరాకు సొంతూళ్లకు వెళ్లిన వారు హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. దాంతో రోడ్లపై వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. నగర వాసులు మెట్రో రైలు మార్గాన్ని ఆశ్రయించారు. అయితే, అందరూ మెట్రో రైల్లోనే ప్రయాణం చేయాలనుకుని ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కు చేరడంతో అక్కడ సైతం భారీగా జనాలు ఉన్నారు. దాంతో ఆఫీసుకు వెళ్లేందుకు బయలుదేరుతున్న వారు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. 

ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్దకు భారీగా ప్రయాణికులు చేరడంతో ప్లాట్‌ఫాం వరకు చేరేందుకు గంట నుంచి రెండు గంటల పాటు క్యూ లైన్లలో నిల్చోవాల్సి వచ్చింది. సాధారణంగా కేవలం వర్షం పడిన సమయంలో ఇలా మెట్రో స్టేషన్ వద్ద రద్దీ కనిపించేది. సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు తిరిగి రావడం, అదే సమయంలో వర్షం పడే అవకాశం ఉండటంతో ఎల్బీ నగర్ మెట్రో రైల్వేస్టేషన్లో జనం రద్దీ కనిపించింది. రైల్లోకి ఎక్కడానికి కూడా రద్దీ వల్ల వీలు కావడం లేదని కొందరు ఇబ్బంది పడుతున్నారు. దాంతో నేడు ఆఫీసులకు వెళ్లే వారికి ఆలస్యం అవుతుంది. 


LB Nagar Metro Station: ఎల్బీనగర్‌లో భారీ ట్రాఫిక్ జామ్.. జాతరను తలపించేలా మెట్రో స్టేషన్ల వద్ద రద్దీతో ఇబ్బందులు

రోడ్లపై వాహనాల రద్దీకి తోడు మెట్రో స్టేషన్‌లోనూ జనాల రద్దీ పెరగడంతో, మెట్రో సిబ్బంది ప్రయాణికులను క్రమపద్ధతిలో క్యూ లైన్ల ద్వారా లోపలికి పంపిస్తున్నారు. దసరా సెలవులల తర్వాత ఒక్కసారిగా తిరుగు ప్రయాణం చేయడం ద్వారా ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు తెలిపారు. రద్దీని తగ్గించడానికి మెట్రో అధికారులు అదనపు రైళ్లు నడిపితే బాగుండేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మెట్రో సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.


LB Nagar Metro Station: ఎల్బీనగర్‌లో భారీ ట్రాఫిక్ జామ్.. జాతరను తలపించేలా మెట్రో స్టేషన్ల వద్ద రద్దీతో ఇబ్బందులు

హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఏపీ నుంచి వచ్చే వాహనాలు ఎల్బీనగర్ చేరుకున్నాక.. నగరంలోని ఆయా ప్రాంతాలకు దారి మళ్లుతాయి. అయితే ఒక్కసారిగా నగరానికి ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Embed widget