అన్వేషించండి

Weather Report: వచ్చే పదిరోజుల వరుణుడి టూర్‌ షెడ్యూల్ ఇదే! తెలుగు రాష్ట్రాలకు ముప్పు ఉందా!

మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతోపాటు చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది.

మధ్యప్రదేశ్‌, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, కోస్తాంధ్రప్రదేశ్‌ సహా కొన్ని రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. జులై 19 నుంచి వాయువ్య భారతదేశంలో, జూలై 18 నుంచి ఈశాన్య రాష్ట్రాలు & సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లో వర్షాలు దంచి కొట్టనున్నాయని అంచనా వేసింది. "రుతుపవన ద్రోణి కొద్దిగా ఉత్తరం వైపుకు మళ్లింది. రాబోయే 2-3 రోజుల్లో దాని సాధారణ స్థితికి వచ్చే ఛాన్స్ ఉంది." అని వాతావరణ సంస్థ తెలియజేసింది.

జూలై 20న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్ & ఉత్తరప్రదేశ్‌లలో చాలా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జులై 18,19 తేదీల్లో రాజస్థాన్‌లో వర్షాలు పడనున్నాయి. ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్ & సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో జులై 18, 19 తేదీల్లో కుండపోత ఖాయమని చెబుతోంది. 

18, 19న కొంకణ్, గోవాలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 18 నుంచి 20 జూలై వరకు కర్ణాటక, 19, 20 తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్, 21, 22 తేదీల్లో పశ్చిమ మధ్యప్రదేశ్, 20 నుంచి 22 వరకు విదర్భ, 19 నుంచి 22 వరకు ఛత్తీస్‌గఢ్,  జులై 18 నుంచి 22 వరకు కేరళలో వర్షాలు భారీగా కురిచే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. 

జులై 18, 19 తేదీలలో విదర్భలో పశ్చిమ మధ్యప్రదేశ్ 18 నుంచి 20 వరకు, తూర్పు మధ్యప్రదేశ్‌లో జులై 18, 21, 22 తేదీల్లో చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 18న మరాఠవాడ &ఉత్తరాధ్ర, యానాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, గుజరాత్ ప్రాంతం, మధ్య మహారాష్ట్ర, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక 18, 19న, 18-20 మధ్య తమిళనాడు, జూలై 18, 22 తేదీల్లో తెలంగాణపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. 

ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో రాబోయే 5 రోజులలో విస్తారంగా తేలికపాటి / మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులలో చత్తీస్‌గఢ్, విదర్భ, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్‌లలో చాలా విస్తృతంగా/విస్తృతంగా తేలికపాటి/మోస్తరు వర్షపాతం, ఉరుములు/మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

మత్స్యకారుల హెచ్చరిక:

దక్షిణ ఒడిశా, ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర తీరాల వెంబడి 60 kmph నుంచి 60 kmph వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అందువల్ల జులై 18, 19 తేదీల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget