అన్వేషించండి

Revanth Wishes To KCR: కేసీఆర్‌కు రేవంత్ వెరైటీ విషెస్! ఇలా ఎవరూ ఊహించరు, ఇంటి వద్ద అరెస్టు

Revanth Reddy Arrest: రేవంత్ రెడ్డి సెటైరికల్‌గా, పరోక్షంగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ పుట్టిన రోజు సందర్భంగా చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోదీ కూడా కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. శుభాంకాంక్షలు తెలిపిన వారిలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే, ఈయన అందరిలా మాత్రం విషెస్ చెప్పలేదు. రోజూ ఏదో వివిధ అంశాలపై సీఎంను విమర్శిస్తూ ఉండే ఆయన.. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంలోనూ అదే పంథా అనుసరించారు. సెటైరికల్‌గా, పరోక్షంగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ఓ ఊసరవెల్లి ఫోటోను జత చేసి, జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో చాలా సార్లు ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి ఊసరవెల్లితో పోల్చిన సంగతి తెలిసిందే. ఊసరవెల్లిలా కేసీఆర్ కూడా రంగులు మార్చుతారని, చెప్పిన హామీలు, ఇచ్చిన మాటలు ఎప్పుడూ నిలబెట్టుకోరని చాలా సార్లు రేవంత్ రెడ్డి విమర్శించారు.

రేవంత్ అరెస్టు
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేయాలన్న డిమాండ్‌తో పోలీస్ కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాల ముట్టడికి నేడు కూడా తెలంగాణ పీసీసీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా కూడా నిరసనలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందస్తుగా కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న (ఫిబ్రవరి 17) పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలను హౌజ్ అరెస్టు చేశారు. ఆయన నివాసం ముందు బారికేడ్లు పెట్టి.. పోలీసులు భారీగా మోహరించారు. ఈ రోజు కూడా హైదరాబాద్ పోలీస్‌ కమిషనరేట్ వద్ద రేవంత్ ధర్నా చేయనున్నట్లు సమాచారం రావడంతో అయన ఇంటివద్దే ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నేడు రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలను నిరసనలు చేయకుండా పోలీసులు ఎక్కడికక్కడే హౌస్‌ అరెస్ట్‌లు, అదుపులోకి తీసుకోవడం వంటివి చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Embed widget