అన్వేషించండి

Breaking News Live: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు ముఖ్యమంత్రి జగన్ లేఖ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు ముఖ్యమంత్రి జగన్ లేఖ

Background

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది. పొడి గాలులు వీచడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాత్రులు చల్లగా ఉంటున్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం వేడి, ఉక్కుపోత అధికంగా ఉంటున్నాయి. చాలా  ప్రాంతాలల్లో 20 డిగ్రీలకు పైగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం వాతావరణంలో మార్పులను సూచిస్తుంది. 

ఏపీలో నేడు సైతం నైరుతి, దక్షిణ దిశల నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. దాంతో ఏపీలో మరో మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం పొడిగా ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలులు వీస్తాయి. వర్ష సూచన లేకపోవడంతో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రలు భారీగా పెరుగుతున్నాయి. వేటకు వెళ్లడానికి మత్స్యకారులకు ఏ ఇబ్బంది లేదు. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 18.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బాపట్లలో 20.7 డిగ్రీలు, నందిగామలో 21.4 డిగ్రీలు, కళింగపట్నంలో 20.6 డిగ్రీలు, అమరావతిలో 21.8 డిగ్రీలు, విశాఖపట్నంలో 23.8 డిగ్రీల, నెల్లూరులో 24.5 డిగ్రీలు, ఒంగోలులో 24.5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుంది. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వేడిగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగానే పెరిగాయి. ఆరోగ్యవరం, అనంతపురం లాంటి ప్రాంతాల్లో  కనిష్ట ఉష్ణోగ్రతలు 20కి చేరువలో ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆరోగ్యవరంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలు నమోదైంది. అనంతపురంలో 18.9 డిగ్రీలు, నంద్యాలలో 22.4 డిగ్రీలు, తిరుపతిలో 20.5 డిగ్రీలు, కర్నూలులో 22.1 డిగ్రీలు, కడపలో 24.2 డిగ్రీల మేర రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణ మొదలైన వేడి..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే వాతావరణం పొడిగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళ చలి గాలులతో ఇబ్బందులు తప్పవన్నారు. అత్యల్పంగా ఆదిలాబాద్ ఏజెన్సీలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఇతర జిల్లాల్లో కనీసం 15 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 20 డిగ్రీలు, నిజామాబాద్‌లో 17.9 డిగ్రీలు, రంగారెడ్డిలో 17 డిగ్రీలు, మెదక్‌లో 18.3 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలోనూ 14.6 డిగ్రీల మేర రెండో కనిష్ట ఉష్ణోగ్రత ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు బాగా పెరిగింది. గ్రాముకు రూ.35 చొప్పున ఎగబాకింది. కానీ, వెండి ధర నేడు నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.46,250 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,460 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు స్థిరంగా రూ.70,000 వద్ద ఉంది. రెండ్రోజులుగా వెండి ధర ఇలాగే ఉండగా.. నేడు కూడా అదే ధర ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.70,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,250 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,460గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.70 వేలుగా ఉంది.

20:41 PM (IST)  •  23 Feb 2022

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు ముఖ్యమంత్రి జగన్ లేఖ


కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు ముఖ్యమంత్రి జగన్ లేఖ

ఉక్రెయిన్ లోని పలు కళాశాలల్లో ఏపీకి చెందిన విద్యార్థులు చిక్కుకుని పోయిన విషయాన్ని వివరించిన సీఎం

ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం కారణంగా ఉక్రెయిన్ లోని భారతీయులను వెనక్కి రావాలని ప్రకటించిన కేంద్రం

ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు వెనక్కి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అన్ని విధాలుగా సహకరిస్తుందని లేఖలో పేర్కొన్న సీఎం జగన్

ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ను లేదా సీఎంఓను  విదేశాంగ శాఖ అధికారులు సంప్రదించాలని లేఖలో సీఎం వినతి

16:55 PM (IST)  •  23 Feb 2022

Hyderabad Traffic Police: ట్రాఫిక్‌ ఉల్లంఘనులకు హైదరాబాద్‌ పోలీసుల భారీ ఆఫర్, ఛలానాలపై 50 శాతం రాయితీ

పెరిగిపోతున్న పెండింగ్‌ ట్రాఫిక్‌ ఛలాన్ల క్రియరెన్స్‌ కోసం హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. మార్చి ఒకటి నుంచి భారీ రాయితీతో చలాన్లు కట్టే అవకాశాన్ని ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులకు 75 శాతం రాయితీ ప్రకటించారు. కార్లకు 50 శాతం, బస్సులకు 30 శాతం రాయితీ ఇచ్చారు. మార్చి ఒకటి నుంచి ఆన్ లైన్, ఈ సేవ ద్వారా చెల్లించేందుకు ఛాన్స్‌ ఇచ్చారు. 

16:21 PM (IST)  •  23 Feb 2022

Vivek Murder Case: వైఎస్‌ వివేకా హత్య దర్యాప్తు అధికారిపై ఏపీలో కేసు, స్టే ఇచ్చిన హైకోర్టు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అధికారి రామ్‍సింగ్‍పై నమోదు చేసిన కేసులో స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు. నిన్న కడప కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు అధికారి రామ్‍సింగ్‍పై కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు. బుధవారం హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ.
దర్యాప్తు అధికారిపై కేసు నమోదు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సీబీఐ న్యాయవాది. వాదనలు విన్న తర్వాత ఈ కేసులో తదనంతర చర్యలు అన్నింటిపై స్టే ఇచ్చిన హైకోర్టు. ఎటువంటి చర్యలు చేపట్టవద్దని పోలీసులకు ఆదేశాలు.

15:03 PM (IST)  •  23 Feb 2022

అల్లం పద్మకు మావోయిస్టుల నివాళులు

గత కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాధ పడుతూ ఫిబ్రవరి 22వ తేదీన తుది శ్వాస విడిచిన అల్లం పద్మకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ నివాళులు తెలిపారు. ఆమె మృతికి  పార్టీ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నదని ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ తన వంతు భాద్యత వహించిందన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఎంతో పరితపించి శక్తి వంచన లేకుండా శ్రమించిందని మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. పోరాడుతున్న ఉద్యమకారులుకు మద్దతునందించి స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపిందన్నారు. తాను ఇచ్చిన స్ఫూర్తితో ఉద్యమకారులు ఉత్సహాంగా విరోచితంగా పోరాడారని తెలిపారు. విరామం ఎరుగక పోరాడిన పోరాట శ్రేణులకు అలసట లేకుండా ఎంతో ఓపికతో భోజనాలు ఏర్పాటు చేసి ఎన్నో సేవలందించిందని చెప్పారు. అందరికి అప్యాయతలు పంచిన అల్లం పద్మ తెలంగాణ అమ్మగా గుర్తింపు పొందిందని వివరించారు. తల్లి పాత్ర పోషించి, స్ఫూర్తిని నింపిన అల్లం పద్మను తెలంగాణ సమాజం, ముఖ్యంగా ప్రజాస్వామిక తెలంగాణ నినాదంతో పోరాడిన ఉద్యమ శక్తులు ఎన్నటికి మరిచి పోవని చెప్పారు. అల్లం పద్మ మరణం మావోయిస్ట్ పార్టీని తీవ్రంగా కలతకు, భాదకు గురి చేసిందన్నారు. అందరిలో ఎంతో గుర్తింపున పొందిన పద్మ భౌతికంగా తెలంగాణ సమాజంలో లేదనడానికి చింతిస్తున్నామని చెప్పారు.

15:00 PM (IST)  •  23 Feb 2022

BJP Leaders: అసమ్మతి నేతల సమావేశం అనేది దుష్ప్రచారం: బీజేపీ నేత

బీజేపీ అసమ్మతి నేతల సమావేశం జరిగినట్టుగా మీడియాలో ప్రసారం చేస్తున్నారని, ఇది సరికాదని పార్టీ లీడర్ వెంకటరమణ అన్నారు. బీజేపీలో సమ్మతి అసమ్మతి అనే వాటికి అవకాశం లేదు. ఈ విధమైన కథనాలు అన్నీ మీడియా వారి సృష్టేనని వ్యాఖ్యానించారు. అందరం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే క్రియాశీల కార్యకర్తలమే. అసత్య ప్రచారంతో కార్యకర్తలను మరియు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Best Selling SUV: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desamఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Best Selling SUV: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
Manchu Family Issue: కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
ICC Punishment: సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
UPSC Mains Result 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Embed widget