అన్వేషించండి

Nampally Fire Accident Update: నాంపల్లి వైపు రావొద్దు - సీపీ, కలెక్టర్ విజ్ఞప్తి - అగ్నిప్రమాదం రెస్క్యూ ఆపరేషన్‌లో క్షణ క్షణం ఉత్కంఠ

Nampally fire: నాంపల్లి అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి రావడం లేదు.నాంపల్లి నుమాయిష్ తో పాటు అటు వైపు రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయం చూసుకోవాలని పోలీసులు సలహా ఇస్తున్నారు.

Children missing in Nampally fire Accident : హైదరాబాద్‌లోని నాంపల్లి చీరక్‌గల్లిలో జరిగిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు  కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదం కారణంగా నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ కు రావాలనుకున్నవారు తమ పర్యటనను వాయిదా వేసుకోవలాని సజ్జనార్ కోరుతున్నారు. కలెక్టర్ కూడా అదే సలహా ఇచ్చారు. నాంపల్లి వైపు రాకపోకలు సాగించేవారు వేరే మార్గాలు చూసుకోవాలన్నారు.    

ఫర్నీచర్ షోరూంలో శనివారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదం ప్రాంతాన్ని భయానక వాతావరణంలోకి నెట్టింది. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.   భవనంలో ఇద్దరు చిన్నారులు,  కొంతమంది సిబ్బంది చిక్కుకున్నట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు. మొత్తం 5 ఫైర్ ఇంజన్ల సాయంతో గంటల తరబడి శ్రమించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది సాహసోపేతమైన చర్యలు చేపట్టారు. భవనంలోని నాలుగో అంతస్తు వరకు మంటలు వ్యాపించడంతో, కిటికీలు,  గ్రిల్స్‌ను తొలగించి లోపలి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఆటంకాలు ఎదురయ్యాయి. మొదటగా రోబోను పంపి బాధితులు ఎక్కడ ఉన్నారో కనిపెట్టేందుకు ప్రయత్నించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కానీ బవనంలో ఉన్నవారి పరిస్థితపై మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది.  

ఈ భారీ ప్రమాదం వల్ల కోట్ల రూపాయల విలువైన ఫర్నీచర్, ముడి సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఫర్నీచర్ దుకాణం కావడంతో అక్కడ ఉన్న పాలిష్ కెమికల్స్, కలప కారణంగా మంటలు అదుపులోకి రావడం కష్టమైంది. భవనం ఇరుకైన గల్లీలో ఉండటంతో భారీ క్రేన్లు, పెద్ద ఫైర్ ఇంజన్లు లోపలికి వెళ్లేందుకు వీలు లేకపోయింది. దీంతో సిబ్బంది పైపులను సుదూరం నుంచి లాగి మంటలను ఆర్పివేయాల్సి వచ్చింది. డీఆర్ఎఫ్  బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకుని కూలిపోయే స్థితిలో ఉన్న భవన భాగాలను పరిశీలిస్తున్నాయి. 

 
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నప్పటికీ, పూర్తిస్థాయి విచారణ తర్వాతే కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరగడంతో అబిడ్స్ - నాంపల్లి మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ బాధితులకు అవసరమైన సాయం అందిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Drought Mandals: తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
BRS Harish Rao:ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Spicy Egg Masala Curry : ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే
ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
Bigg Boss Season 10 Today October 27th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Embed widget