అన్వేషించండి

Telangana State Anthem: కీరవాణి మ్యూజిక్ చేయడానికిది "నాటు నాటు" పాట కాదు- ఒక రణ నినాదం, ధిక్కార స్వరం

Telangana News: తెలంగాణ రాష్ట్ర గీతం వివాదం మరింత ఉద్ధృతమవుతోంది. ఇందులోకి రాజకీయ పార్టీలు కూడా జోక్యం చేసుకుంటున్నాయి. ఇప్పుడు తీవ్ర విమర్శలతో బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్‌ కుమార్ ట్వీట్ చేశారు.

MM Keeravani Compose Telangana State Anthem : తెలంగాణలో ప్రభుత్వం తీసుకొస్తున్న రాష్ట్ర గీతం వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. దీన్ని ఎంఎం కీరవాణికి మ్యూజిక్ చేయాలని ప్రభుత్వం కోరడంపై బీఆర్‌ఎస్‌నేతలు తప్పుబడుతున్నారు. తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్ర గీతం వివాదం రాను రాను రాజుకుంటోంది. కీరవాణి మ్యూజిక్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్‌ఎస్ నేతలు గొంతులు సవరించుకుంటున్నారు. ఇవాళ దీనిపై సుదీర్ఘమైన విమర్శలతో ట్వీట్ చేసిన బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రేవంత్ సర్కారుపై విరుచుకు పడ్డారు. కీరవాణి సంగీత సమకూర్చడానికి ఇది నాటు నాటు పాట కాదని... తెలంగాణ రణ నినాదమని గర్జించారు. 

"అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై 'ఆంధ్రా' సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెత్తనం ఏంది భై ? గీత  స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చింది? అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలం? అదీ తెలంగాణ వచ్చి పదేళ్లయినంక? అంటూ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 
"ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డీ... కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇదీ "నాటు నాటు" పాట కాదు. నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందల మంది అమరుల త్యాగాలు, 4 కోట్ల ప్రజల కలల ప్రతి రూపం. ఒక రణ నినాదం. ధిక్కార స్వరం. అందెశ్రీ ఇచ్చిన ఒరిజినల్ ట్యూన్‌తోనే ఈ గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలాపించింది. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 3, 2011 విద్యార్థి గర్జనలో లక్షల మంది ప్రజలు ఈ గీతాన్ని సామూహికంగా ఆలాపించిన తీరు చూసుంటే మీరు ఈ దుస్సాహసం చేయరు. మీరప్పుడు అక్కడ ఉండే అవకాశం లేదు కాబట్టి బహుశా మీకిది తెల్వదు. నేనారోజు అక్కడ ఉన్న కాబట్టి చెబుతున్న." అని రాసుకొచ్చారు.  

Image

 

"టాలీవుడ్, తెలంగాణ ఉద్యమం వేరువేరు. టాలీవుడ్ వినోదం కోసం ఉంది.  తెలంగాణ గీతం అనేది ఉద్యమ సమయంలో తెలంగాణ నినాదాన్ని  ఒకచోట చేర్చిన భావోద్వేగం. జనగణమన, వందేమాతరం చిత్రాలకు ట్యూన్ ఇచ్చింది హాలీవుడ్ కాదు. "అని అన్నారు. 

"పాపం అందెశ్రీ అమాయకుడు, నిస్సహాయుడు కాబట్టి మౌనంగా కూర్చున్నడు. మీరేం చేసినా భరిస్తున్నడు." 

Image

"మీరు ఆంధ్ర సంగీత కళాకారులకు అంత ముచ్చటపడితే దయచేసి ఏపీకి వెళ్లి అక్కడ సీఎం అవ్వండి. తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చుంటే తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించి తెలంగాణ ప్రతిభను ప్రోత్సహించాలి సార్.  ప్రజాప్రతినిధులు, ఆంధ్రా ఏజెంట్ల పాలన మనకు చాలు. ఇలాంటి దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో తరాలు పోరాడి ప్రాణాలు కోల్పోయాయి."

తెలంగాణ ప్రజలారా, జూన్ 2 నాడు ఆంధ్ర సంగీతకారులు స్వరకల్పన చేసిన మన తెలంగాణ గీతాన్ని పాడుకుందమా, లేక మన ఒరిజినల్ గీతాన్నే పాడుకుందమా?? అని పిలుపునిచ్చారు ప్రవీణ్‌కుమార్. చెప్పాలంటే బాధగా ఉందని ముగించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget