Bandi Sanjay: తెలంగాణలో పీఎఫ్ఐ బాంబులు పేల్చేందుకు కుట్ర చేస్తోంది - బండి సంజయ్
Bandi Sanjay: తెలంగాణలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) బాంబులు పేల్చేందుకు కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఆ పార్టీ హిందువుల తలలు నరికేదని వివరించారు.
Bandi Sanjay: తెలంగాణలో బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చెప్పారు. హిందువుల తలలు నరికి చంపే పీఎఫ్ఐ.. ఎంఐఎం నేతల కనుసన్నల్లోనే పని చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో పీఎఫ్ఐ విస్తరించడానికి టీఆర్ఎస్ యే కారణం అని, ఆ పార్టీ నేతలు కొంతమంది చందాలు ఇచ్చి మరి ఆ పార్టీని పెంచి పోషిస్తున్నారంటూ తీవ్ర కామెంట్లు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కు నాగోల్ చౌరస్తా వద్ద స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 100 రోజుల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా గజమాలతో సకత్కరించారు. ఓ గొర్రెపిల్లను కూడా బహుకరించారు. కాగా నాగోల్, కొత్తపేట డివిజన్ మోహన్ నగర్, చైతన్యపురిలో ఆయన ప్రసంగించారు.
Live: Day 9 of #PrajaSangramaYatra4 https://t.co/l4BRIF1k4g
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 21, 2022
కవిత లిక్కర్ స్కాంపై సీఎం నోరెందుకు మెదపట్లేదు..?
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్... పీఎఫ్ఐకు చెందిన సంస్థలపై ఎన్ఐఏ దాడి చేసేంతవరకు ఎందుకు పట్టించుకోలేదని బండి సంజయ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ ముఠా బిహీర్ లో బాంబులు తయారు చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పేల్చేందుకు కుట్ర చేసిందని చెప్పారు. 2040 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది ఒక్క బీజేపీయేనని తెలిపారు. అలాగే ఏ స్కాం బయటకు వచ్చినా అందులో కల్వకుంట్ల కుటుంబం పాత్ర ఉంటుందని ఎద్దేవా చేశారు. కొడుకు, బిడ్డ తప్పు చేసినా జైల్లో పెడతానన్న సీఎం కేసీఆర్... కవిత లిక్కర్ స్కాంపై ఎందుకు నోరు మెదపట్లేదని అన్నారు. రాష్ట్ర ప్రజల కష్టాలను గాలికి వదిలేసి దేశ రాజకీయాలంటూ తిరుగుతున్నాడని విమర్శించారు. సీబీఐ, ఈడీ దాడులు చూసి సీఎం కేసీఆర్ కుటుంబం క్వారంటైన్ కు వెళ్తుందంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
ఈరోజుతో ముగియనున్న ప్రజా సంగ్రామ యాత్ర..
ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 22 అంటే ఈరోజు వరకు కొనసాగుతోంది. ముగింపు కార్యక్రమం ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఇబ్రహీంపట్నంలోని పెద్ద అంబర్ పేట సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. స్థలం కూడా ఖరారైంది. ఈ సభకు కేంద్ర గ్రామీణాభివ్రుద్ది సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సక్సెస్ చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలోనే పాదయాత్ర పేరిట దాదాపు 13 బహిరంగ సభలు నిర్వహించి విజయవంతం చేశామని అన్నారు. అధికారిక పార్టీ సహా మరే పార్టీ కూడా ఇంత తక్కువ సమయంలో ఈ సంఖ్యలో సభలు పెట్టిన దాఖలాలు లేవని అన్నారు. 4వ విడత పాదయాత్ర, పేద అంబర్ పేట బహిరంగ సభ మునుగోడు ఉప ఎన్నికపై ప్రభావం చూపడంతో పాటు బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఇమేజ్ పెరుగుతుండటంతో పార్టీని దెబ్బ తీసేందుకు అధికార పార్టీ వేస్తున్న ఎత్తుగడలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.