By: ABP Desam | Updated at : 13 Mar 2023 12:13 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ట్రిపుల్ ఆర్‌కు ఆస్కార్ వచ్చిందన్న సంతోషాన్ని దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. సెలబ్రెటీలంతా ట్రిపుల్ ఆర్ టీంను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఇదే టైంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నెటిజన్లకు దొరికేశారు. ట్రిపుల్ ఆర్‌కు వ్యతిరేకంగా గతంలో ఆయన ఇచ్చిన వార్నింగ్ డైలాగ్స్‌ను పోస్టు చేస్తూ మంత్రి కేటీఆర్‌తోపాటు నెటిజన్లంతా ఆడేసుకుంటున్నారు.
ట్రిపుల్ ఆర్ చిత్రీకరణ టైంలో ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేసింది రాజమౌళి టీం. ఎన్టీఆర్ తలపై ముస్లిం టోపీ ధరించి కనిపించారు. దీన్నే బీజేపీ తప్పుపట్టింది. బండి సంజయ్ లాంటి వాళ్లు తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. ఆ సీన్‌లు మార్చకుంటే మాత్రం సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు కూడా. సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం బరిశెలతో కొడతామన్నారు. థియేటర్ల వద్దకు ఎవరూ వెళ్లలేరని వార్నింగ్ ఇచ్చారు.
Congratulations to team @RRRMovie on winning the prestigious Oscar award for the song #NaatuNaatu written by @boselyricist
And this is the right time to remember what kind of venom bigots like @bandisanjay_bjp spewed on this movie.
Let's reject such hatemongers! pic.twitter.com/hAthO0MlyG — Konatham Dileep (@KonathamDileep) March 13, 2023
అప్పట్లో బండి సంజయ్ సహా కొందరు బీజేపీ లీడర్లు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇప్పుడు ఆస్కార్‌స్థాయికి వెళ్లి ట్రిపుల్ టీంను ప్రశంసిస్తూనే అలాంటి వారిని బెదిరించిన బండి కామెంట్స్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంత గొప్ప కళాఖండంపై కొందరు విషం చిమ్మారంటూ అప్పట్లో బండి సంజయ్ చేసిన కామెంట్స్‌ను రీ ట్వీట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.
అలా ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.... అదే పెద్ద మనిషి మోడీ వల్లే ట్రిపుల్ ఆర్‌కు ఆస్కార్ వచ్చిందని కూడా చెప్పగలరంటూ ఎద్దేవా చేశారు.
Not before long, the SAME Bigot will tell you the Award was given only because of Modi 😂 https://t.co/8Z0hp6FETl
— KTR (@KTRBRS) March 13, 2023
అప్పట్లో ట్రిపుల్ ఆర్‌పై నోరు పారేసుకున్న వ్యక్తే ఇప్పుడు ఆస్కార్ వచ్చిందని శుభాకాంక్షలు చెప్పడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఏ ఎండకు ఆ గొడుకు పట్టే రకమంటూ విమర్సలు చేస్తున్నారు.
Congratulations and best wishes to team @RRRMovie for clinching the best original song #NaatuNaatu at #Oscars . This moment is historic for Indian cinema and particularly for Telugu people. Proud of @Rahulsipligunj for his performance today which truly deserved standing ovation pic.twitter.com/4ICLiSMLNT
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 13, 2023
https://t.co/4y8HPUjAQd
— Alluarjun fan 🪓 (@RohithDEVARAK03) March 13, 2023
Idhi marchipoyinav enti raa Gunda ljk
Anna.. Nuvu ichina panikimalina statement e boomerang la venakki vachindhi anna 🤦🏻♂️ pic.twitter.com/bucwz0yqVY
— Sunil Raju (@sunilraju_) March 13, 2023
CM KCRకు బండి సంజయ్ లేఖ- విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్
Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం, కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్లు ఆత్మహత్య!
ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?
Modi Hyderabad Tour: మోదీ హైదరాబాద్ టూర్ డేట్ ఫిక్స్ - రెండో వందేభారత్ ట్రైన్ ప్రారంభించనున్న ప్రధాని
KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్లో సరికొత్త రికార్డ్!
Game Changer First Look: స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్, ఇరగదీసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్