Gangula Kamalakar: బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై మంత్రి గంగుల విమర్శలు.. అభివృద్ధి ఎక్కడంటూ మాజీ మంత్రికి కౌంటర్
హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారం మరింత వేడెక్కుతోంది.
హుజూరాబాద్ ఉపఎన్నికలకు ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించింది. ఆయన నామినేషన్ సైతం దాఖలు చేశారు. కాంగ్రెస్ సైతం తమ అభ్యర్థిగా బల్మూరు వెంకట్‌ను నిన్న ప్రకటించింది. మరోవైపు బీజేపీ అధిష్టానం తమ అభ్యర్థిగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేరు ఆదివారం నాడు ప్రకటించింది. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ ఈటల రాజేందర్ ను బరిలోకి దింపడంతోనే ఆయనపై టీఆర్ఎస్ శ్రేణుల విమర్శలు మొదలుపెట్టాయి.
హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ పట్టణంలోని ప్రజలతో కలిసి బోర్నపల్లి, 14 వ వార్డు, ఇతర ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. మంత్రిగా పనిచేసినప్పటికీ ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గంలో 350 రోడ్లకు 3 రోడ్లు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.50 కోట్లతో నియోజకవర్గంలో మౌళిక వసతులు కల్పిచనుందని, తమ అభ్యర్థికి మద్దతుగా నిలవాలని ఓటర్లను కోరారు.
ఏ ప్రాంతంలోనైనా నీరు, రోడ్లు, సరైన సదుపాయాలు ఉంటేనే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెడుతాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తమకు రోడ్లు కావాలని స్థానికులు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకోలేదని ఆరోపించారు. వందల దరఖాస్తులు ఇచ్చినా స్పందించకపోవడం దారుణమన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంగనర్, సిరిసిల్లతో పాటు సిద్దిపేట అభివృద్ధి చెందగా.. హుజూరాబాద్ మాత్రం ఎందుకు వెనుకబడిందో చెప్పాలని ఈటలను ఈ సందర్భంగా ప్రశ్నించారు.
👉 ఆత్మగౌరవ కుల సంఘాల భవనాలు, గ్రామ దేవతల గుడులు కట్టిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం
— Gangula Kamalakar (@GKamalakarTRS) October 3, 2021
👉 రైతుబందు, రైతుభీమా, 24గంటల ఉచిత కరెంటు, ఆసరా ఫించన్లు, ధళిత బందు ఇస్తుంది టీఆర్ఎస్
👉 సంక్షేమ టీఆర్ఎస్ కు ఓటేద్దాం, సంక్షోభం స్రుష్టించే బీజేపీని తరిమేద్దాం@trspartyonline#HuzurabadWithTRS pic.twitter.com/Ng1I77x45c
గతంలో తెలంగాణలో కరెంట్, నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారని, హుజూరాబాద్ డెవలప్ మెంట్ కోసం భారీగా నిధులు వెచ్చించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే రూ.50 కోట్లతో రోడ్ల పనులు కొనసాగుతుండగా.. వాటికి అదనంగా రూ.1.7 కోట్లతో రెండు బ్రిడ్జి పనులు జరుగుతున్నాయని గుంగుల పేర్కొన్నారు. ఆత్మగౌరవం కోసం కుల సంఘ భవనాలు నిర్మిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్ అన్నారు. కాలిపోయిన మోటార్లు అనేది పాత మాట అని, రైతుబందు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, 24గంటల ఉచితకరెంటుతో తెలంగాణ ప్రభుత్వం సమూల మార్పులు చేసిందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఓటు వేసి మద్దతు తెలిపాలన్నారు.
Also Read: బాలకృష్ణతో మంచు విష్ణు భేటీ.. ప్రకాష్ రాజ్ విందు రాజకీయాలు