Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో భారీగా వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో వరుసగా రెండో రోజు నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది.
హైదరాబాద్‌లో వరుసగా రెండో రోజు వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్ పరిధిలో వర్షం మొదలైంది. ఉప్పల్, రామాంతాపూర్, బోడుప్పల్, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ ఏరియాల్లో వర్షం కురుస్తోంది. రోడ్లపై వర్షపు నీరు చేరుకోవడంతో కొన్నిచోట్ల వాహనాలు నెమ్మదిగా కదలడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
#HYDTPinfo #TrafficAlert
— Hyderabad Traffic Police (@HYDTP) September 21, 2024
Due to heavy #Rainfall and #Waterlogging there is slow movement of traffic Cheekoti, Begumpet.
Begumpet Traffic Police regulating the traffic and with #DRF clearing the #Waterlogging pic.twitter.com/PuyVWHf9y3
హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. వికారాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల మోస్తరు వాన పడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గత కొన్ని రోజులనుంచి ఎండల నుంచి ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగింది. జలుబు, దగ్గు, జ్వరం, డెంగ్యూ లాంటి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో శుక్రవారం నాడు 74 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, శనివారం నాడు అంతకుమించిన వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్ లో 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏరియాల వారీగా చూస్తే గోల్కొండలో 74.3 మి.మీ, మెహిదీపట్నంలో 71.5 మి.మీ, కార్వాన్ లో 65.8 మి.మీ వర్షం కురిసిం
HyderabadRains ⛈️⚠️
— Telangana Weatherman (@balaji25_t) September 21, 2024
SEVERE STORMS across Yadadri - Bhongir, Rangareddy, Vikarabad, Siddipet further spreading East now. During 6.50PM - 8PM various parts of East HYD will get strong storms. However few parts can also miss the powerful storms