అన్వేషించండి

Fine For TSRTC Bus: ఆర్టీసీ బస్సుకు రూ. 2,131 ఫైన్, ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Fine For TSRTC Bus: బస్సు నాలుగు గంటలు ఆలస్యంగా రావడం, దాని వల్ల ఓ మహిళ అస్వస్థతకు గురవ్వడంతో టీఎస్ఆర్టీసీ బస్సుకు రూ. 2,131 ఫైన్ విధించింది వినియోగదారుల కమిషన్.

Fine For TSRTC Bus: ఆర్టీసీ బస్సు ఆలస్యంగా వచ్చిందని.. తెలంగాణ ఆర్టీసీకి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. లేటుగా రావడమే కాకుండా గమ్య స్థానానికి చేర్చడంలో చాలా ఆలస్యం చేశారు. దీంతో ఓ ప్రమాణికురాలు అస్వస్థతకు గురైంది. దీంతో ఓ వినియోగదారుడు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించగా.. తెలంగాణ ఆర్టీసీకి జరిమానా విధించింది. టికెట్ డబ్బు రూ.631, పరిహారంగా వెయ్యి రూపాయలు, కేసు ఖర్చుల కింద 500 రూపాయలు.. మొత్తం 2, 131 రూపాయలను నెలన్నర రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. 

అసలేం జరిగిందంటే..?

2019వ సంవత్సరం ఆగస్టులో హైదరాబాద్ కు చెందిన న్యాయవాది ఫహీమా బేగమ్.. దిల్‌సుఖ్ నగర్ నుంచి మణుగూరుకు టికెట్ బుక్ చేసుకున్నారు. ఆగస్టు 9వ తేదీన బస్టాండుకు వెళ్లారు. అయితే రాత్రి 7.15 గంటలకు రావాల్సిన బస్సు 11.15కు వచ్చింది. దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చింది. ఎందుకు ఇంత ఆలస్యం అయిందని ఫహీమ ప్రశ్నించగా.. దురుసుగా మాట్లాడారు. అంతే కాకుండా మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు గమ్య స్థానానికి చేర్చాల్సి ఉండగా.. 9.45 కు చేర్చింది. అయితే బస్టాండులో నాలుగు గంటల పాటు వేచి ఉండటంతో ఫహీమ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఫహమీ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. 

ఆమె చేసే ఆరోపణలన్నీ నిరాధారమైనవి..

ఫిర్యాదుపై స్పందించిన వినియోగదారుల కమిషన్.. ఆర్టీసీని విచారించింది. అయితే ఫహీమ చేసే ఆరోపణలన్నీ నిరాధారమైనవని, ప్రయాణం రద్దయితేనే టికెట్ డబ్బు రీఫండ్ చేస్తామని ఫిర్యాధి దారులకు నష్టం కల్గించేలా ఆర్టీసీ ప్రవర్తించలేదని తమ సేవల్లో లోపం లేదని వివరించింది. సాక్ష్యాధారాలు పరిశీలించిన కమిషన్ అధ్యక్షురాలు చిట్నేని లతా కుమారి, సభ్యులు జీవీఎస్ ప్రసాద్ రావు, డీ మాధవీ లతతో కూడిన బెంచ్ తెలంగాణ ఆర్టీసీకి ఫైన్ విధించారు.

బస్సు ఆలస్యం వల్లే ఫహీమకు అస్వస్థత..

నిజంగానే మణగూరుకు 2 గంటల 20 నిమిషాలు బస్సు ఆలస్యంగా చేరుకున్నట్లు బెంచ్ గుర్తించింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు ఆలస్యంగా రావడం వల్ల ఫిర్యాదిదారు అస్వస్థతకు గురైనట్లు వైద్యుడు ధ్రువీకరించిన ప్రిస్కిప్షన్ సాక్ష్యంగా ఉందని, ఇది ముమ్మాటికీ సేవల్లో లోపమే అని తెలిపారు. అంతే కాకుండా టికెట్ డబ్బు రూ.631, పరిహారంగా మరో 1000 రూపాయలు, కేసు ఖర్చుల కింద 500 రూపాయలు.. మొత్తం 2, 131 రూపాయలను నెలన్నర రోజుల్లో ఆమెకు చెల్లించాలని సూచించింది.
Also Read: Huzurabad News: హుజూరాబాద్‌లో ముగిసిన ఛాలెంజ్ డెడ్‌లైన్, చౌరస్తాకు కౌశిక్ రెడ్డి - భారీగా ఉద్రిక్తత, తోపులాటలు 

ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకునే సాంకేతిక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మొబైల్‌ ఫోన్‌లలో ‘టీఎస్‌ఆర్టీసీ బస్‌ ట్రాకింగ్‌’ అనే యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే ఏ బస్సు ఎక్కడుందోతెలియజేసే  ట్రాకింగ్‌ సేవలను మంగళవారం (జూలై 26) ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అయితే, ప్రస్తుతానికి హైదరాబాద్ లోని వేర్వేరు ప్రాంతాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పుష్పక్‌ ఏసీ బస్సులతో పాటు, హైదరాబాద్‌ నుంచి విజయవాడ, శ్రీశైలం, భద్రాచలం, ఏలూరు, విశాఖపట్నం, తదితర ప్రాంతాలకు వెళ్లే దూరప్రాంత బస్సుల్లోనూ ట్రాకింగ్‌ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే రైళ్లలో ఈ సదుపాయం ఉంది. రైల్ యాత్రి అనే యాప్ ద్వారా రైలు లైవ్ స్టేషన్ ను తెలుసుకోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Hussain Sagar Ganesh immersion rules 2026: ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాల్లేవ్ - నిషేధం బోర్డులు పెట్టిన అధికారులు - మరి ఖైరతాబాద్ గణేశుడి పరిస్థితేంటి?
ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాల్లేవ్ - నిషేధం బోర్డులు పెట్టిన అధికారులు - మరి ఖైరతాబాద్ గణేశుడి పరిస్థితేంటి?
KTR Delimitation statement: ఇప్పుడున్న నిష్పత్తి కొనసాగిస్తే చాలు - డీలిమిటేషన్‌కు సపోర్టు - బీఆర్ఎస్ వ్యూహం మారిందా?
ఇప్పుడున్న నిష్పత్తి కొనసాగిస్తే చాలు - డీలిమిటేషన్‌కు సపోర్టు - బీఆర్ఎస్ వ్యూహం మారిందా?
Erravalli Farmhouse Probe: రేవంత్ రెడ్డి భూముల అస్త్రం - బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి - ఫామ్ హౌస్‌ లెక్కలన్నీ బయటకు వస్తాయా?
రేవంత్ రెడ్డి భూముల అస్త్రం - బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి - ఫామ్ హౌస్‌ లెక్కలన్నీ బయటకు వస్తాయా?
22A Land Declaration: 222A నిషేధిత భూమిగా ఎలా ప్రకటిస్తారు.. నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
22A నిషేధిత భూమిగా ఎలా ప్రకటిస్తారు.. నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supriya Yarlagadda: సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
PM Narendra Modi birthday 2026: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
AP local body elections 2026: స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
IPL Auction In India.!: మూడేళ్ల తర్వాత భారత్‌ లో ఐపీఎల్ వేలం.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై పునరాలోచనలో బీసీసీఐ, అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
మూడేళ్ల తర్వాత భారత్‌ లో ఐపీఎల్ వేలం.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై పునరాలోచనలో బీసీసీఐ, అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Aadarsha Kutumbam: వెంకీ మామ సినిమాలో డింపుల్ స్టెప్పులు... 'ఆదర్శ కుటుంబం'లో స్పెషల్ సాంగ్?
వెంకీ మామ సినిమాలో డింపుల్ స్టెప్పులు... 'ఆదర్శ కుటుంబం'లో స్పెషల్ సాంగ్?
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget