అన్వేషించండి

Telangana Students: విద్యాసంస్థల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బందికి ఫేషియ‌ల్ రిక‌గ్నేష‌న్ తప్పనిసరి - తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

Telangana Schools: హాజరు కాకుండా హాజరయ్యామని సంతకం చేయడానికి వీల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, టీచర్లకూ ఫేషియ‌ల్ రిక‌గ్నేష‌న్ త‌ప్ప‌నిస‌రి చేశారు.

Facial recognition mandatory for students in Telangana:  పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వ విద్యాల‌యాల వ‌ర‌కు ప్ర‌తి విద్యా సంస్థ‌లోనూ మెరుగైన  బోధ‌న సాగాల‌ని.. విద్యా బోధ‌న‌లో నాణ్య‌త ప్ర‌మాణాలు మ‌రింత‌గా పెంచాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, ప్రొఫెషిన‌ల్ కోర్సులు బోధించే క‌ళాశాల‌ల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బందికి ఫేషియ‌ల్ రిక‌గ్నేష‌న్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని సీఎం ఆదేశించారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగ‌వ‌డంతో పాటు ప్రొఫెష‌న‌ల్ విద్యా సంస్థ‌ల్లో లోటుపాట్ల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌న్నారు. విద్యా శాఖ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. 

విద్యా శాఖ ప‌రిధిలో అద‌న‌పు గ‌దులు, వంట గ‌దులు, మూత్ర‌శాల‌లు, మ‌రుగుదొడ్లు, ప్ర‌హారీల నిర్మాణం వివిధ విభాగాలు చేప‌ట్ట‌డం స‌రికాద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ నిర్మాణాల‌ నాణ్య‌త‌ప్ర‌మాణాలు, నిర్మాణ ప‌ర్య‌వేక్ష‌ణ‌, నిధుల మంజూరు, జ‌వాబుదారీత‌నానికి గానూ ఒకే విభాగం కింద ఉండాల‌న్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వ‌స‌తుల అభివృద్ధి సంస్థ (EWIDC) కింద‌నే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థ‌ల నిర్మాణాలు కొన‌సాగాల‌ని సీఎం ఆదేశించారు. ఈ సంస్థ‌కు అవ‌స‌ర‌మైన ఇంజినీరింగ్‌, ఇత‌ర సిబ్బందిని ఇత‌ర విభాగాల నుంచి వెంట‌నే డిప్యూటేష‌న్‌పై తీసుకోవాల‌ని సూచించారు. మ‌ధ్యాహ్న భోజ‌న బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛాన‌ల్‌లో చేప‌ట్టాల‌ని... ఈ విష‌యంలో ఎటువంటి అల‌స‌త్వం చూపొద్ద‌ని సీఎం అన్నారు. తె

లంగాణ‌లోని మ‌హిళా కళాశాల‌లు, బాలికల పాఠ‌శాల‌ల్లో మూత్ర‌శాల‌లు, మ‌రుగుదొడ్లు, ప్ర‌హ‌రీల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాల‌ని సీఎం ఆదేశించారు. కంటైన‌ర్ కిచెన్ల‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని.. కంటైన‌ర్ల‌పైన సోలార్ ప్యానెళ్ల‌తో అవ‌స‌ర‌మైన విద్యుత్ వినియోగించుకోవ‌చ్చ‌ని సీఎం తెలిపారు. ప్ర‌తి పాఠ‌శాల‌లో క్రీడ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అవ‌స‌ర‌మైతే కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిన వ్యాయామ ఉపాధ్యాయుల‌ను నియ‌మించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల కింద పాఠ‌శాల‌ల్లో పారిశుద్ధ్య ప‌నులకు సంబంధించిన బిల్లులు త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని సీఎం ఆదేశించారు. సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల్లోని బాలిక‌ల‌కు వివిధ అంశాల‌పై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మ‌హిళా కౌన్సెల‌ర్ల‌ను నియ‌మించాల‌ని సీఎం సూచించారు.  

విద్యా రంగంపై పెడుతున్న ఖ‌ర్చును తాము ఖ‌ర్చుగా కాక పెట్టుబ‌డిగా చూస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల‌తో పాటు విద్యా రంగం అభివృద్ధికి తీసుకునే రుణాల‌ను ఎఫ్ఆర్‌బీఎం ప‌రిమితిలో లేకుండా చూడాల‌ని ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశార‌ని సీఎం తెలిపారు. ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో చదువుతున్న వారిలో 90 శాతానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నార‌ని, ఈ విష‌యాన్ని నిర్ధారించేందుకు గ‌త ప‌దేళ్ల‌లో ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో చ‌దివిన వారి వివ‌రాల‌పై నివేదిక రూపొందించాల‌ని సీఎం ఆదేశించారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమెరికా గ్రేట్‌ ఇమిగ్రెంట్స్ జాబితా.. హైదరాబాద్ శాస్త్రవేత్తతో పాటు నలుగురు భారతీయులు
అమెరికా గ్రేట్‌ ఇమిగ్రెంట్స్ జాబితా.. హైదరాబాద్ శాస్త్రవేత్తతో పాటు నలుగురు భారతీయులు
MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కీలక బాధ్యతలు
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Reaction Cattle Death: కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
Petrol Diesel Price Down India: లీటర్ పెట్రోల్ రేటు ఐదు రూపాయల తగ్గింపు - ఆ బంకుల్లో మాత్రమే!
లీటర్ పెట్రోల్ రేటు ఐదు రూపాయల తగ్గింపు - ఆ బంకుల్లో మాత్రమే!
PM Modi: 2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
Prakash Raj: ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి! జర్నలిస్టుల అరెస్టులపై ఏపీలో మొదలైన కొత్త పొలిటికల్ వార్!
ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి! జర్నలిస్టుల అరెస్టులపై ఏపీలో మొదలైన కొత్త పొలిటికల్ వార్!
Palnadu Road Accident: 2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం.. ఛాన్స్ ఉందా
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష రివార్డ్.. ఛాన్స్ ఉందా
Trisha: మళ్ళీ ట్రెండింగ్‌లోకి త్రిష... తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్... ఎందుకంటే?
మళ్ళీ ట్రెండింగ్‌లోకి త్రిష... తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్... ఎందుకంటే?
TDP Blacklisted MLAs List 2026: దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
Embed widget