అన్వేషించండి

Telangana New DGP: తెలంగాణ కొత్త డీజీపీగా సిన్సియర్ ఐపీఎస్ - ఆయన పేరు ఖరారు అయినట్లేనా!?

CV Anand: తెలంగాణ న్యూ డీజీపీ గా సీవీ ఆనంద్ పేరు దాదాపుగా ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా అధికారిక ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంది.

CV Anand name almost finalized as Telangana  new DGP:  తెలంగాణ రాష్ట్ర నూతన పోలీస్ బాస్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్ర , సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం డీజీపీగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.    1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ పేరు   UPSC  పంపిన ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌లో  అగ్రస్థానంలో ఉంది. రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనే పోలీస్ బాధ్యతలు చేపట్టేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ నెలాఖరుతో ముగియనుండటంతో, తదుపరి వారసుడిగా ఆనంద్ పగ్గాలు చేపట్టనున్నారు.
 
 సీనియారిటీలో తిరుగులేని అధికారి 

ప్రస్తుతం తెలంగాణ పోలీస్ క్యాడర్‌లో సీవీ ఆనంద్ అత్యంత సీనియర్ అధికారిగా ఉన్నారు. 1989, 1990 బ్యాచ్‌లకు చెందిన అధికారులు రిటైర్ అవ్వడం లేదా కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో, 1991 బ్యాచ్‌కు చెందిన ఆనంద్ రేసులో అందరికంటే ముందు నిలిచారు. UPSC ప్రతిపాదించిన జాబితాలో వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా పేర్లు ఉన్నప్పటికీ, వారు 1994 బ్యాచ్ వారు కావడంతో ఆనంద్‌కు ఉన్న మూడేళ్ల అదనపు సీనియారిటీ ప్రధాన బలంగా మారింది.

దీర్ఘకాలిక పదవీ కాలం ప్లస్ పాయింట్ 

ప్రభుత్వం సీవీ ఆనంద్‌ను ఎంపిక చేయడానికి మరో కీలక కారణం ఆయన సర్వీస్ కాలం. ఆయన 2028 మే  వరకు సర్వీసులో ఉంటారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, డీజీపీగా నియమితులైన వారు కనీసం రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉండాలి. సీవీ ఆనంద్ నియామకం జరిగితే, ఆయనకు రెండేళ్లకు పైగా పదవీ కాలం ఉంటుంది. ఇది రాష్ట్రంలో శాంతిభద్రతల స్థిరత్వానికి, పోలీస్ సంస్కరణల అమలుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

 అపార అనుభవం.. క్షేత్రస్థాయి పట్టు 

సీవీ ఆనంద్‌కు క్షేత్రస్థాయిలో   పరిపాలనలో విశేష అనుభవం ఉంది. గతంలో ఆయన హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి మెట్రోపాలిటన్ పోలీసింగ్‌లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, పౌర సరఫరాల శాఖలో ఐటీ సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రభుత్వానికి భారీగా ఆదాయం మిగిల్చారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై, ప్రస్తుత సవాళ్లపై ఆయనకు ఉన్న పట్టును పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఆయన వైపే మొగ్గు చూపింది.

 ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన 

ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ అధికారి అయినప్పటికీ, గతంలో అనివార్య కారణాల వల్ల ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు  అప్పగించాల్సి వచ్చింది. ఇప్పుడు నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి డీజీపీని నియమించాల్సి ఉండటంతో ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేసింది. సీవీ ఆనంద్ పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు  జారీ చేసే అవకాశం ఉంది. ఈ నియామకంతో తెలంగాణ పోలీస్ శాఖలో సరికొత్త మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.          

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Internal Rebellion: రేవంత్ రెడ్డి - ప్రత్యర్థులపై బలవంతుడు .. సొంత ఇంట్లో బలహీనుడు !?
రేవంత్ రెడ్డి - ప్రత్యర్థులపై బలవంతుడు .. సొంత ఇంట్లో బలహీనుడు !?
Minister Konda Surekha: కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం - రేవంత్ ఆట ముగిస్తారా!?
కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం - రేవంత్ ఆట ముగిస్తారా!?
Breaking News: బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
Auto Drivers Strike: తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మికుల సమ్మె విరమణ
తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మికుల సమ్మె విరమణ

వీడియోలు

Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
LPG e-KYC: LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
స్కోడా కుషాక్ 8 స్పీడ్ ఆటోమేటిక్‌ వెర్షన్‌... 6 స్పీడ్ ఆటోమేటిక్‌ కంటే మైలేజ్ ఎంత పెరిగిందో తెలుసా?
స్కోడా కుషాక్ కొత్త ఆటోమేటిక్ కారు నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తోంది? కంపెనీ లెక్క సరిపోయిందా?
చూపులకే పాతది.. నడిపితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు! రేంజ్ రోవర్ స్పోర్ట్ EV ప్రత్యేకతలు ఇవే
రేంజ్ రోవర్ స్పోర్ట్‌కు ఇక ఇంధనం అవసరం లేదు.. ఈ ఎలక్ట్రిక్ SUV చాలా పవర్‌ఫుల్‌ గురూ!
Varanasi Update : వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
Type 2 Diabetes : టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
YS Vivekananda Reddy Case: వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
Embed widget