అన్వేషించండి

Sudini Srujan Reddy: తెలంగాణ రాజకీయాల్లో అందరి నోటా సృజన్ రెడ్డి పేరే - వ్యక్తిగా లో ప్రోఫైల్ .. కానీ !

Srujan Reddy: సూదిని సృజన్ రెడ్డి ఇప్పుడీ పేరు తెలంగాణ రాజకీయాల్లో మారుమోగిపోతోంది. ఇంతకీ ఈ సృజన్ రెడ్డి ఎవరు? ఎవరికి బాగా దగ్గర?

Complete details about Sudini Srujan Reddy:  తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం  సూదిని సృజన్ రెడ్డి  పేరు పెను సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పదే పేద ఈయన పేరును వెలుగులోకి తెస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ సృజన్ రెడ్డి మీవాడేనని ఆధారాలు చూపిస్తోంది. మొత్తంహా ఈ సృజన్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు.  రాజకీయాలకు, వ్యాపారాలకు మధ్య వారధిలా వ్యవహరించే సృజన్ రెడ్డి, అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండింటితోనూ విడదీయలేని బంధుత్వాలు, సంబంధాలు కలిగి ఉండటం విశేషం. ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి స్వయానా అల్లుడు కావడంతో పాటు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య వైపు నుండి దూరం బంధువు కూడా కావడంతో, ఈ  బంధుత్వాల చార్ట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.   

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తొలి సారి సృజన్ రెడ్డి పేరు        

సృజన్ రెడ్డి పేరు మొదటిసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  ఢిల్లీ లిక్కర్ స్కామ్  విచారణ సమయంలో ప్రముఖంగా వినిపించింది. ఈ కేసులో ఈడీ   , సీబీఐ సోదాలు జరిగినప్పుడు ఆయన పాత్రపై అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో బీఆర్ఎస్ అగ్రనేతలకు అత్యంత సన్నిహితుడిగా, ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాల్లో కీలక వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. కొందరు ఆయన్ని కేవలం వ్యాపారవేత్తగా చూస్తే, రాజకీయ విశ్లేషకులు మాత్రం తెరవెనుక చక్రం తిప్పే వ్యూహకర్తగా అభివర్ణిస్తుంటారు.        

బీఆర్ఎస్ హాయాంలో నూ భారీగా ప్రాజెక్టులు, కాంట్రాక్టులు       

 గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సృజన్ రెడ్డి సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల్లో వేల కోట్ల రూపాయల విలువైన పనులను దక్కించుకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యమే ఇందుకు కారణమని అప్పట్లో విపక్షాలు తీవ్రంగా విమర్శించేవి. అయితే, అనూహ్యంగా ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆయన హవా తగ్గకపోవడం, రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న ప్రస్తుత కాలంలోనూ ఆయన కంపెనీలు కాంట్రాక్టుల్లో పాలుపంచుకుంటున్నట్లు వార్తలు రావడం చర్చనీయాంశమైంది.          

రేవంత్ రెడ్డి సతీమణి తరపు బంధువు  - బీఆర్ఎస్‌కు అదే అస్త్రం                       

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి సృజన్ రెడ్డిని ఒక అస్త్రంగా వాడుకుంటోంది. తమ హయాంలోనే సృజన్ రెడ్డి అత్యధిక కాంట్రాక్టులు పొందినప్పటికీ, రేవంత్ రెడ్డితో ఉన్న బంధుత్వాన్ని సాకుగా చూపుతూ రాజకీయ విమర్శలకు తెరలేపింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోగల సృజన్ రెడ్డి నేర్పు, అటు మామ బీఆర్ఎస్ నేత ఉపేందర్ రెడ్డి, ఇటు బంధువు  సీఎం రేవంత్ మధ్య నలిగిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఆయన ఇప్పటి వరకూ బయటకు వచ్చి తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించలేదు.  

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha Political Future: బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం ఉండదు - బీజేపీలో ఇమడలేరు - కొండా దంపతులకు దారేది?
బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం ఉండదు - బీజేపీలో ఇమడలేరు - కొండా దంపతులకు దారేది?
Basara Temple Master Plan: రూ.354 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన
రూ.354 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన
KCR Resignation Demand Congress: కేసీఆర్ రాజీనామా డిమాండ్ వెనుక కాంగ్రెస్ మైండ్ గేమ్ - అనర్హత వేటు వేసే ధైర్యం ఉందా?
కేసీఆర్ రాజీనామా డిమాండ్ వెనుక కాంగ్రెస్ మైండ్ గేమ్ - అనర్హత వేటు వేసే ధైర్యం ఉందా?
Clash at Jubilee Hills Pub: జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Konda Surekha Political Future: బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం ఉండదు - బీజేపీలో ఇమడలేరు - కొండా దంపతులకు దారేది?
బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం ఉండదు - బీజేపీలో ఇమడలేరు - కొండా దంపతులకు దారేది?
Basara Temple Master Plan: రూ.354 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన
రూ.354 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన
Vangaveeti Radha: నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
నీ అంతు చూస్తానంటూ వంగవీటి రాధాకు బెదిరింపులు.. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు
Harish Rao: గతంలో ఎంజీఆర్ నుంచి చంద్రబాబు వరకు చేసిందిదే.. కేసీఆర్ విషయంలోనూ అదే తప్పు: హరీష్ రావు
గతంలో ఎంజీఆర్ నుంచి చంద్రబాబు వరకు జరిగిందిదే.. కేసీఆర్ విషయంలోనూ అదే తప్పు: హరీష్ రావు
Bigg Boss Telugu 10 House : బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 10 హౌస్‌లో రోబో - ఇంటీరియర్ విజువల్ వండర్... స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
Clash at Jubilee Hills Pub: జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
జూబ్లీహిల్స్ పబ్ లో అర్ధరాత్రి గొడవ.. ఎంపీ సోదరుడు సహా పలువురిపై కేసు నమోదు
Duleep Trophy Final:  షాకింగ్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన‌ తిలక్ వర్మ .. దులీప్ ట్రోఫీ ఫైనల్లో హై ఓల్టేజ్ డ్రామా
షాకింగ్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన‌ తిలక్ వర్మ .. దులీప్ ట్రోఫీ ఫైనల్లో హై ఓల్టేజ్ డ్రామా
Embed widget