అన్వేషించండి

Telangana Politics: తెలంగాణలో సవాల్ పాలిటిక్స్ - ప్రాజెక్టులపై చర్చ అసెంబ్లీలోనా ? ప్రెస్ క్లబ్‌లోనా ?

Telnangana : తెలంగాణ రాజకీయాల్లో చర్చల కోసం సవాళ్ల పాలిటిక్స్ నడుస్తున్నాయి. అసెంబ్లీకి రావాలని రేవంత్ సవాల్ చేస్తే.. ప్రెస్ క్లబ్‌కు రావాలని కేటీఆర్ అంటున్నారు.

Challenge politics in Telangana: తెలంగాణ రాజకీయాల్లో నీరు నిప్పులు కురిపిస్తోంది.   నీటి వాటాల ఒప్పందాలు, బనకచర్లపై చర్చించేందుకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అసెంబ్లీ లో చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే సవాల్ విసురుతున్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలోనూ ఇదే సవాల్ చేశారు. దీనిపై  కేటీఆర్ స్పందించారు. 72 గంటల సమయం ఇస్తున్నాం ప్రిపేర్ అయి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని రివర్స్ కౌంటర్ వేశారు. రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అక్కర్లేదని.. తాము చాలని కేటీఆర్ అన్నారు. 

కేటీఆర్ కౌంటర్ పై కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. అసెంబ్లీకి రమ్మంటే.. ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెడతామని అనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్ కు అర్ధం కానట్లుందని మంత్రి సీతక్క అన్నారు.  విదేశాల్లో ఉన్న కేటీఆర్ తాను తెలంగాణకు వచ్చినట్లు చెప్పేందుకే మీడియా సమావేశం పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు.అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటే.. కేటీఆర్ ప్రెస్‌క్లబ్‌కు రమ్మనడం ఏంటి? ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంది ప్రెస్‌క్లబ్‌లో చర్చించడానికి కాదన్నారు. బీఆర్ఎస్ డెడ్ అయిన పార్టీ.. డెడ్‌లైన్ పెట్టడం విడ్డూంగా ఉంది. కేటీఆర్.. నీ సొంత చెళ్లే నిన్ను నాయకుడిగా గుర్తించడం లేదంటూ సీతక్క ఎద్దేవా చేశారు. పొన్నం ప్రభాకర్‌తో పాటు ఇతర నేతలు కూడా ఇవే సవాళ్లు చేశారు. 

మరో వైపు కేసీఆర్ రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశాల ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.  కాళేశ్వరం , బనకచర్ల వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై  కేసీఆర్ ప్రెస్మీట్ పెడతారని అంటున్నారు.  పవర్ పాయింట్ ప్రజెంటేన్‌తో కేసీఆర్ చేసుకున్న ఒప్పందాల పత్రాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన, చేస్తున్న  అన్యాయాలను వివరించే పత్రాలను వెలుగులోకి తెస్తారని అంటున్నారు.   అయితే ఎప్పుడు  అనేది మాత్రం చెప్పడం లేదు. రెండు రోజుల్లో ఉండవచ్చని అంటున్నారు.   రేవంత్ రెడ్డికి కేటీఆర్ పెట్టిన  72 గంటల ప్రెస్మీట్ టార్గెట్ అయిపోయిన తర్వాత  కేసీఆర్ ప్రెస్ మీట్‌ పెట్టే అవకాశాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. 

అయితే ఇలాంటి చర్చలకు అసెంబ్లీ కరెక్ట్ గా ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.   బీఆర్ఎస్ ముందుకు వస్తే..అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని రేవంత్ పదే పదే సవాల్ చేస్తున్నారు. అలాంటి సమయంలో విడిగా ప్రెస్ మీట్ పెడితే ప్రయోజనం ఉంటుందా అని కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.  అసెంబ్లీలో పోటాపోటీగా జరిగే సమావేశాలు, చర్చల్లో  ది నిజమో.. ఏది అబద్దమో బయటపడుతుంది. అసెంబ్లీలో ఒక వేళ బీఆర్ఎస్ నేతలు తగిన సమయం ఇవ్వకపోతే ఆ విషయాన్ని ప్రజలు చూస్తారు. మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ.. ప్రెస్ మీట్లకు.. ప్రెస్ క్లబ్ చర్చలకు సవాల్ చేస్తుందన్నది కాంగ్రెస్ వర్గాల ప్రశ్న. ఈ సవాళ్ల రాజకీయం ఎన్ని రోజులు ఉంటుందో కానీ తెలంగాణ పాలిటిక్స్ మాత్రం హాట్ హాట్ గా ఉంటున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Formula E Case Adjourned: ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
Breaking News:పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Embed widget