అన్వేషించండి

PV Narasimha Rao: పీవీ స్వగ్రామంలో సంబురాలు - జిల్లాకు ఆయన పేరు పెట్టాలని గ్రామస్థుల విజ్ఞప్తి

PV Home Town: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడంపై ఆయన స్వగ్రామంలో సంబురాలు చేసుకున్నారు. జిల్లాకు ఆయన పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Celebrations in PV Narasimha Rao Home Town: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావుకు (PV NarasimhaRao) కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) ప్రకటించడంపై ఆయన స్వగ్రామంలో సంబురాలు చేసుకున్నారు. హన్మకొండ (Hanmakonda) జిల్లా భీమదేవరపల్లిలోని వంగరలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు నిర్వహించారు. పీవీ ఇంటి ఆవరణలో టపాసులు కాల్చి.. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ మిఠాయిలు పంచిపెట్టి గ్రామంలో ర్యాలీ తీశారు. ఆయన పుట్టింది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామమే అయినా.. భీమదేవరపల్లి మండలం వంగరలో పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలకు దత్తత రావడంతో ఆయన ఇంటి పేరు, ఊరు మారిపోయింది.

'జిల్లాకు ఆయన పేరు పెట్టాలి'

ఎన్నో భూ, ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఘనత పీవీ నరసింహారావుకే దక్కుతుందని ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కొనియాడారు. ఆయనకు కేంద్రం దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఆనందంగా ఉందని అన్నారు. అందరు ప్రధాన మంత్రులను గౌరవించిన విధంగానే పీవీ నరసింహారావును కూడా గౌరవించి ఢిల్లీలో పీవీ సమాధితో కూడిన పీవీ ఘాట్ నిర్మించాలని గ్రామస్థులు కోరారు. అలాగే, రాష్ట్రంలో పీవీ జిల్లాను ప్రకటించాలని.. ఆయన పేరుపై ఓ యూనివర్శిటీ కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మంథని ప్రజల హర్షం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎం పదవిని అధిరోహించి.. అనంతరం ప్రధాని పదవిని సైతం అధిరోహించిన పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల ఆ నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1957 నుంచి వరుసగా 4 పర్యాయాలు మంథని ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ ప్రాంత సమస్యలు పరిష్కరించేందుకు ఆయన తన వంతు కృషి చేశారని గుర్తు చేసుకుంటున్నారు. అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించేలా.. 1976లోనే మంథని నుంచి కాళేశ్వరం వెళ్లేందుకు వీలుగా స్ప్రింగ్ వంతెన నిర్మించిన ఘనత పీవీదేనని కాటారం ప్రాంత వాసులు ఆయన సేవలను కొనియాడుతున్నారు.

Also Read: PV Narasimha Rao: ఆ ఒక్క మాటతో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చేశారు - పీవీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా!

టాప్ హెడ్ లైన్స్

Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Revanth Reddy Love Story: ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
Embed widget