అన్వేషించండి

Bandi Sanjay: గాలి గొట్టం గాళ్లపై కోర్టుకెళ్తాం, ఈసీకి కంప్లైంట్ చేస్తాం, సీబీఐ దర్యాప్తు కావాలి: బండి సంజయ్

Munugode Elections: మునుగోడు ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో జరిగిన డ్రామాపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు న్యాయస్తానాన్ని ఆశ్రయిస్టున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ డ్రామాకు తెరదీశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలోనే ఈ డ్రామా అంతా జరిగిందని.. బీజేపీని అకారణంగా బదనాం చేసేందుకు యత్నించిన సదరు పోలీస్ కమిషనర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో మునిగిపోతామనే భయంతో కేసీఆర్ వేసిన ఇలాంటి చిల్లర డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

మునుగోడులో ఓడిపోతున్నామనే భయంతో ఎన్నిక రద్దు చేయించాలని సీఎం కుట్ర పన్నుతున్నారు. రేపు ఉదయం 9 గంటలకు యాదాద్రికి వస్తున్నా. కేసీఆర్.. నీ ప్రమేయం లేకుంటే ప్రమాణం చేద్దాం.. రా. నువ్వు రాకుంటే ఈ డ్రామా అంతా నీ ఆధ్వర్యంలోనే జరిగినట్లే భావిస్తాం. అకారణంగా బీజేపీని బదనాం చేస్తున్న పోలీస్ కమిషనర్ సంగతి చూస్తాం. ఎమ్మెల్యేల చేత ఇంతవరకు స్టేట్ మెంట్ ఎందుకు రికార్డ్ చేయించలేదు? పట్టుబడ్డ ఆ డబ్బుల వివరాలు ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదు?

ఈ రోజు (అక్టోబరు 27) మునుగోడు క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్, ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ జి.వివేక్ వెంకటస్వామి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, ఎన్వీ సుభాష్, జె.సంగప్ప తదితరులతో కలిసి బండి సంజయ్ కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో జరిగిన తప్పిదాలు, అక్రమాలను వివరిస్తూ టీఆర్ఎస్ పై బీజేపీ ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో కేసీఆర్ డ్రామాలను ఎండగట్టారు. అందులోని ముఖ్యాంశాలు..

• నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగబోతోంది. ఏ ఎన్నిక జరిగినా పోటీ చేయబోయే అభ్యర్థులు, నియోజకవర్గానికి ఏం చేశారు? ఏం చేయబోతున్నారనే అంశాలను స్పష్టం చేయాలి.

• మునుగోడు ఉప ఎన్నిక ఎందుకొచ్చిందో ప్రజలకు తెలుసు. మరో ఏడాదికిపైగా సమయం ఉన్నా.. కేసీఆర్ మూర్ఖత్వపు పాలన, అనాలోచిత నిర్ణయాలు, దుర్మార్గపు ఆలోచనలు, కక్ష్యపూరిత ధోరణి, ఈర్ష్యాద్వేషాలతో వ్యవహరిస్తూ మునుగోడును పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రాజీనామా చేశారు.

• కేసీఆర్ పాలనలో చేసిన తప్పిదాలపై రూపొందించిన ఛార్జ్ షీట్‌ ను రూపొందించాం.

• నకల్ కొట్టడానికి అకల్ ఉండాలే... అది కూడా కేసీఆర్ కు లేదు.. ఎమ్మెల్యేల కొనుగోలు అంతా ఓ డ్రామా? 

• ఎఫ్ఐఆర్ నమోదై 12 గంటలు దాటింది. ఇంతవరకు వివరాల్లేవు. ప్రగతి భవన్ లో ఇంకా స్క్రిప్ట్ రడీ కాలేదేమో. మిమిక్రీ అర్టిస్టులు రాలేదేమో..

• ఒక్క ఉప ఎన్నిక గెలిచేందుకు ఇంత డ్రామా ఎందుకు? 

• మీడియా సైతం వాస్తవాలను బయటపెట్టాలి. దీనివెనుక ఉన్న కుట్రలను చేధించాలి. కానీ దురద్రుష్టవశాత్తు రెండు, మూడు ఛానళ్లు పాలకులతో కుమ్కక్కై అబద్ధాలను ప్రచారం చేయడం బాధాకరం.

• ఈ రోజు కాకుంటే రేపైనా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడు ఆ ఛానళ్ల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలి. 

• నిన్న జరిగిన డ్రామాలో ఫాంహౌజ్ వాళ్లదే.. డబ్బులు తరలించింది ఎమ్మెల్యే వాహనమే. ఫిర్యాదు చేసింది వాళ్లే... బాధితులు వాళ్లే... 

• డబ్బులు ఆఫర్ చేసిన గాలి గొట్టం గాళ్లు టీఆర్ఎస్ నేతల వ్యాపార భాగస్వాములు.. కేసీఆర్ కుటుంబంతోనూ వ్యాపార సంబంధాలున్నయ్. ఈ లెక్కన వాళ్లు కూడా టీఆర్ఎసోళ్లే..

• నిన్న ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో జరిగిన కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన డ్రామా.  తతంగమంతా సంబంధిత పోలీస్ కమిషనర్ చేయించిన డ్రామాయే... అందుకోసం తన పరిధిలోని ప్రాంతాన్నే ఎంచుకున్నడు. ఈ ఎపిసోడ్ లో కమిషనర్ తప్పించుకోలేరు?

• తక్షణమే ఈ వ్యవహారానికి వేదికైన దక్కన్ కిచెన్ సెంటర్ సీసీటీవీ పుటేజీ బయటపెట్టాలి. ప్రగతి భవన్ కు గత వారం రోజుల నుండి ఎవరెవరు వస్తున్నారు? ఢిల్లీలో సీఎంను కలిసిన వారెవరు? పోలీస్ కమీషనర్, నలుగురు ఎమ్మెల్యేల, సూత్రధారులు, పాత్రధారుల కాల్ లిస్టుతోపాటు సీఎం క్యాంపు ఆఫీష్ ల్యాండ్ లైన్ ఫోన్ లిస్ట్ కూడా బయటపెట్టాలి.

• ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సీఎం రాసిన స్క్క్రిప్టు బెడిసి కొట్టింది. మళ్లో కొత్త డ్రామాకు తెరదీస్తున్నరు. ప్రగతి భవన్ లో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు.

• ఎందుకంటే నిజంగా అక్కడ డబ్బులు దొరికితే.. ఆ డబ్బును మీడియాకు ఎందుకు చూపలేదు? ఆ బ్యాగులో ఏముంది? బాంబులేమైనా ఉన్నాయా?

• నిన్న ఉదయం 11.26 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైతే... సాయంత్రం వరకు అనుకూలమైన 2 ఛానళ్ల వారికే సమాచారం ఇవ్వడం వెనుక మర్మమేమిటి?

• అక్కడికి వచ్చిన పోలీసాఫీసర్ తమకేమీ తెలియదని, కమీషనర్ పంపితే వచ్చామని.. బ్యాగులో డబ్బులెక్కడున్నాయని చెప్పిన మాటలను గుర్తుంచుకోవాలి.

• ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేం కోర్టును ఆశ్రయిస్తాం. సీబీఐ విచారణ కూడా జరపాలి. ఎన్నికలు జరుగుతున్నందున కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తాం. ముఖ్యమంత్రికి నిజంగా చిత్తుశుద్ధి ఉంటే తక్షణమే స్పందించాలి. 

• ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా వెనుక పెద్ద కుట్ర ఉంది. దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు... రేపు ఉదయం 9 గంటలకు యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి వద్దకు నేనొస్తున్నా... కేసీఆర్... నీకు ఈ ఎపిసోడ్ తో సంబంధం లేదనుకుంటే... రేపు అక్కడికి రావాలి. నాతోపాటు ప్రమాణం చేయాలి. రేపు ఉదయం 9 నుండి 10 గంటలకు యాదాద్రి వద్ద ఎదురు చూస్తా. 

• నీ నీచపు బుద్ది, చిల్లర వేషాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది. ఒక్క ఉప ఎన్నిక గెలవడానికే ఇట్లాంటి డ్రామాలు చేస్తున్న కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ఇంకెన్ని వేషాలు వేస్తారోనని ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు నవ్వుకుంటున్నారు.

• ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు... ఎమ్మెల్యేలను విచారించడానికి పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకెళ్లలేదు? వాళ్ల స్టేట్ మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదు? పైగా బీజేపీ ఇదంతా చేయించినట్లుగా పోలీస్ కమీషనర్ లీక్ ఇస్తడు? సిగ్గుండాలె.. అందులో బీజేపీ వాళ్లెవరున్నరు? ఎంత ధైర్యం? వాళ్లు బీజేపోళ్లని ఎట్లా చెబుతవ్? అసలు డబ్బులేవి? ఎందుకు సీజ్ చేయలేదు? ఎందుకు ఆ డబ్బు వివరాలు బయటపెట్టలే? అందులో ఎంత సొమ్ము నొక్కేస్తున్నవ్?

• పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు తీసుకెళ్లి మళ్లీ సీఎం ఆధ్వర్యంలో బయట ఏం చెప్పాలో ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నారు. ఈరోజో రేపో మళ్లీ ప్రెస్ మీట్ పెట్టించి అబద్దాలు చెప్పించేందుకు యత్నిస్తున్నరు.

• గాలి గొట్టంగాడికి ఏ బీజేపీ నాయకులు ఫోన్ చేశారో ఎందుకు చెప్పలేదు? ఎఫ్ఐఆర్ లో బీజేపీ నాయకులు పేర్లు ఉండాలి కదా... మరి అవేవీ లేకుండా బీజేపీ పేరును ఎందుకు బదనాం చేస్తున్నరు? ఈ సమాచారాన్ని రెండు ఛానళ్లలోనే ఎందుకు వచ్చింది? ఇదంతా ఓ ప్లాన్..

• పైగా ఫుల్లుగా తాగి రోడ్డెక్కి టీఆర్ఎస్ నేతలు చేసిన డ్రామాలు చూసి జనం నవ్వుకుంటున్నరు. వాస్తవాలు రేపోమాపో బయటకు వస్తాయి. సీఎం ఇప్పటికైనా చిల్లర వేషాలు బంద్ చేయాలే. తెలంగాణ ప్రజలు పరువు తీస్తున్నరు.

టాప్ హెడ్ లైన్స్

KTR Speech ABP Southern Rising Summit 2026 : రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Telangana Education Reforms: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
CM Revanth Reddy: నరేంద్ర మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్, దేశాన్ని అప్పుల్లోకి నెట్టాడు: ABP సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
నరేంద్ర మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్, దేశాన్ని అప్పుల్లోకి నెట్టాడు: ABP సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget