News
News
వీడియోలు ఆటలు
X

Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
TSPSC పేపర్ లీకేజీ పై ఈడీకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు

TSPSC పేపర్ లీకేజీ పై ఈడీకి ఫిర్యాదు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు.

@ఈడీ కార్యాలయం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామెంట్స్

టీఎస్పీఎస్సీ దొంగలకు, దోపీడీదారులకు, అవినీతిపరులకు అడ్డాగా మారింది.

పరీక్షల నిర్వహణలోఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు.

లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

వందలాది మంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయినా కల్వకుంట్ల కుటుంబానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.

కేసుతో లింక్ ఉన్న ప్రభుత్వ పెద్దలను అమరవీరుల స్థూపం ముందు ఉరేసినా తప్పులేదు.

ఇంత జరిగినా నిరుద్యోగులకు కేటీఆర్ క్షమాపణ చెప్పి పారదర్శక విచారణ చేయిస్తారనుకున్నాం

కానీ సిట్ తో కేసులు వేయించి మా విద్యార్థి నాయకులను నిర్బంధించడం సిగ్గుచేటు

పేపర్ లీకేజ్ లో నేరమే శంకరలక్ష్మి దగ్గర నుంచి మొదలైంది.

ఏ1 గా శంకర లక్ష్మిని, ఏ2గా చైర్మన్, సెక్రెటరీలను పెట్టాలి


కేసులో కావాల్సిన వారిని కాపాడి చిన్న ఉద్యోగులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ అంశంపై మేం ఇప్పటికే కోర్టును ఆశ్రయించాం

 కోర్టులో కేసు విచారణ జరుగుతోంది.

ఈడీ జాయింట్ డైరెక్టర్ ను కలిసి పిర్యాదు చేశాం

420, 120బీ సెక్షన్లు ఈడీ పరిధిలోకి వస్తాయి.

కేటీఆర్ తో సహా టీఎస్పీఎస్సీ అధికారులందరినీ విచారించాలని కోరాం

సిట్ కొద్ది మందినే విచారిస్తుందని మాకు సమాచారం ఉంది.

పూర్తి సమాచారం సేకరించి విచారణ చేయాలని ఈడీ అధికారులను కోరాం.

జగిత్యాల జిల్లాలో పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్ కు అందించిన వారు ఎవరు.

కటాఫ్ మార్కుల గురించి పరీక్ష రాసిన అభ్యర్థులకె తెలియదు.

కేటీఆర్ కు ఈ విషయాలు ఎలా తెలిశాయి?

పారదర్శక విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఈడీ అధికారులు హామీ ఇచ్చారు.

పరువున్న వారు పరువు నష్టం దావా వేస్తారు.

కేటీఆర్ తెలంగాణ పరువును 

నిజంగా కేటీఆర్ కు పరువు ఉంటే సీబీఐ, ఈడీ అధికారులతో పారదర్శక విచారణకు అదేశాలివ్వాలి

లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని లేఖ రాయాలి.

కేటీఆర్ పరువు 100కోట్లు అని ఎలా నిర్ణయిస్తారు?

విద్యార్థులు, నిరుద్యోగుల ఉసురు తీయొద్దు..

వాళ్ల ఉసురు తగిలితే సర్వనాశనం అయిపోతారు.

ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదు

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో దాడి జరిగింది. మందడం గ్రామంలో మూడు రాజధానులకు మద్దతుగా  కొంత మంది శిబిరం నిర్వహిస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై 1200 రోజులుఅవుతున్న సందర్భంగా .. వారికి సంఘిభావం ప్రకటించేందుకు సత్యకుమార్ వచ్చారు. ఆ తర్వాత తుళ్లూరులో పార్టీ నేత ఒకరిని పరామర్శించడానికి వెళ్లారు. ఆయన తుళ్లూరు నుంచి మందడంలోని మూడు రాజధానుల మద్దతు శిబిరం మీదుగా వెళ్తారన్న సమాచారం ముందుగానే తెలియడంతో కొంత మంది ముందుగానే ఆయనను అడ్డుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సత్యకుమార్ కాన్వాయ్ మందడం దగ్గరకు రాగానే కొంత మంది అడ్డుకున్నారు. మరికొంత మంది రాళ్లతో దాడి చేశారు. దీంతో సత్యకుమార్ కాన్వాయ్ కర్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.

ఒంటిపై కిరోసిన్ పోసుకుని కార్మికుడు ఆత్మహత్యాయత్నం, గంగవరం పోర్ట్ గేట్ వద్ద ఉద్రిక్తత

విశాఖ: గాజువాక.

గంగవరం పోర్ట్ గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది

జీతాలు పెంచమని గత కొద్ది రోజులగా ఆందోళన చేస్తున్న కార్మికులు...

లేబర్ కమీషనర్ కి వినతి పత్రం  ఇచ్చిన కార్మికులు...

ఈ నేపథ్యంలో ఒక కార్మికుడ్ని తొలగించిన యాజమాన్యం...

మధ్యాహ్నం పోర్ట్ గేట్ వద్ద పేర్లా ధనరాజు అనే కార్మికుడు ఒంటిపై కిరోసిన్ వేసుకొని ఆత్మహత్యయత్నం 

హుటాహుటిన అడ్డుకున్న పోలీస్లు...

Adilabad News: స్కూల్ ముందు హనుమాన్ దీక్షాపరుల ఆందోళన

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని సెయింట్ పాల్ స్కూల్ లో హనుమాన్ దీక్షాపరులు ఆందోళన చేపట్టారు. 6వ తరగతి చదువుతున్న బానోత్ అభినవ్ అనే విద్యార్థి హనుమాన్ దీక్ష చేపట్టి దీక్షా దుస్తులతో స్కూల్ కు వెళ్ళాడు. దీంతో సెయింట్ పాల్ స్కూల్ ప్రిన్సిపాల్ దీనా..  స్కూల్ యూనిఫాం వేసుకొని రావాలంటూ విద్యార్థికి క్లాస్ ఇచ్చారు. ఇది గత రెండు రోజుల క్రితం జరిగిన విషయం. అయితే తనతో పాటు దీక్ష వేసుకున్న మరికొందరికి ఈ విషయం తెలవడంతో హనుమాన్ దీక్ష పరులు విద్యార్థికి మద్దతుగా సెయింట్ పాల్ స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహారించడం సరికాదని ప్రిన్సిపాల్ దీనాను హనుమాన్ దీక్షపరులు నిలదీశారు. దీంతో గంటసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే చివరికి ప్రిన్సిపాల్ దీనా ఇంకోసారి ఇలా పునరావృతం కాకుండా చూసుకుంటానని క్షమాపణ చెప్పడంతో అందరు ఆందోళన విరమించారు.

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర‌ రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే తల్లి,‌ కుమార్తె దుర్మరణం

చిత్తూరు జిల్లా గంగవరం మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి కూతుర్లు ప్రమాదంలో మృతి చెందారు. గంగవరం మండలం గాంధీనగర్ వాసులుగా గుర్తించిన గంగవరం పోలీసులు గుర్తించారు. వనిత(32), చారునేత్ర (8)లు చీలవారిపల్లెకి వెళ్లి సొంత గ్రామానికి తిరుగు ప్రయాణంలో సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా దూసుకొచ్చిన లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతి దేహాలను శవ పరీక్షల నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Telangana High Court: టీఎస్ హైకోర్టులో నేడు వివేకా హత్య కేసుపై విచారణ
 • టీఎస్ హైకోర్టులో నేడు వివేకా హత్య కేసుపై విచారణ
 • ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో సీబీఐ పిటిషన్ 
 • సీబీఐ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ
 • వివేక హత్య కేసు లో ఏ 1 గా ఉన్న గంగి రెడ్డి
 • ప్రస్తుతం డిఫాల్ట్ బెయిల్ కింద బయటే ఉన్న గంగి రెడ్డి
 • గంగి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని హై కోర్ట్ ను కోరిన సీబీఐ
 • ఎర్ర గంగిరెడ్డికి ఇటీవలే  హైకోర్టు నోటీసులు
 • నేడు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ
Nampally Court: TSPSC కేసులో రేణుక బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో తీర్పు 
 • నాలుగు రోజుల క్రితం రేణుక తరపున బెయిల్ పిటిషన్ దాఖలు 
 • ఈ కేసులో  రేణుక రిమాండ్ గడువు ముగిసిందని, అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ ఇవ్వాలంటూ కోరిన రేణుక
 • రేణుకకు కుమారుడు కొడుకు చిన్నపిల్లలని బెయిల్ ఇవ్వాలని గత విచారణలో కోర్టుకు విన్నవించిన న్యాయవాది
 • కేసు విచారణకు ఆమె మొదటి నుంచి సహకరిస్తోందని, ఇక ముందు కూడా సహకరిస్తుందని వాదనలు
 • ఈ కేసులో ఆమె ప్రత్యక్ష ప్రమేయం లేదని, ఇది కేవలం ప్రాథమిక నేరాభియోగం మాత్రమే అని తెలిపిన రేణుక న్యాయవాది
 • కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని, చాలా మంది పాత్ర ఇందులో ఉందని సిట్ విచారణలో వెల్లడైందని కోర్టుకు తెలిపిన పీపీ
 • ఈ దశలో బెయిల్ ఇస్తే విచారణపై ప్రభావం చూపుతుందని తెలిపిన పీపీ
 • నేడు బెయిల్ పిటిషన్‌పై తీర్పు
Alluri Sitaramaraju: మన్యం మండలాల్లో కొనసాగుతున్న బంద్

ఏలూరు జిల్లా మన్యం మండలాల్లో బంద్ కొనసాగుతోంది. ఎస్టీ జాబితాలోకి బోయ వాల్మీకి కులాలను చేర్చేందుకు అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేపట్టడంతో పలు ఆదివాసీ సంఘాలు భగ్గమంటున్నాయి. దీంతో మన్యం మండలాల్లో బంద్ కు పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ ఆదివాసీ సంఘాలు రోడ్ ను బ్లాక్ చేశారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుట్టాయగూడెంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. తెల్లవారిగుడెంలో ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో రోడ్డును బ్లాక్ చేశారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తమకు మద్దతు పలకాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Nizamabad News: నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య అప్ డేట్

నిజామాబాద్ మెడికల్ కళాశాలలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాలడ్డాడు. రెండు నెలల్లో ఇది రెండో ఆత్మహత్య కాగా, రెండేళ్లలో ముగ్గురు మరణించారు. హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఎం.సనత్ (21) అనే మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. బయటకు రాకపోవడంతో అనుమానంతో తెరిచి చూడగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఆదిలాబాద్ జిల్లాకు హర్ష అనే ఫైనలియర్ విద్యార్థి సూసైడ్ చేసుకుంది. గతేడాది విద్యార్థిని కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. రెండేళ్లలో ముగ్గురు మెడికోలు ఆత్మహత్య చేసుకుని మరణించడం కలకలం రేపుతోంది.

Nizamabad News: నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

ఈ ఏడాది ఫిబ్రవరి 25న హర్ష అనే ఫైనలియర్ విద్యార్థి సూసైడ్ 

గతేడాది విద్యార్థిని కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది

రెండేళ్లలో ముగ్గురు మెడికోలు ఆత్మహత్య చేసుకుని మరణించారు.

Background

ద్రోణి నేడు ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య భాగాల నుంచి ఈరోజు ఉత్తర చత్తీస్‌ఘడ్ నుంచి విదర్భ, మరఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

నేడు తెలంగాణలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. వచ్చే 5 రోజులు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 3 వరకూ ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని చెప్పారు.

హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 50 శాతం నమోదైంది.

ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు ఎక్కడా వర్షాలు పడే అవకాశం లేదని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణంతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. వచ్చే 5 రోజుల పాటు ఇదే రకం వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు.

ఢిల్లీలో వాతావరణం ఇలా..
మార్చి నెల ముగియనున్న వేళ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాతావరణం భిన్నంగా ఉంది. గురువారం మరోసారి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఢిల్లీ, న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ పటేల్ నగర్, బుద్ధ జయంతి పార్క్, రాష్ట్రపతి భవన్, రాజీవ్ చౌక్, ఢిల్లీ కాంట్, ఇండియా గేట్, సఫ్దర్‌జంగ్, లోడీ రోడ్, వసంత్ విహార్, ఆర్కే పురం, డిఫెన్స్ కాలనీ, వసంత్ లైట్ వరకు కుంజ్, పరిసర ప్రాంతాలలో కొన్ని చోట్ల మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. బుధవారం కూడా రాజధాని పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

IMD ప్రకారం, గురువారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 18.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం, ఢిల్లీలో గురువారం ఉదయం 9 గంటలకు మొత్తం గాలి నాణ్యత సూచిక (AQI) 175 నమోదైంది, ఇది 'మోడరేట్' విభాగంలోకి వస్తుంది. 0 - 50 మధ్య ఉన్న AQI 'మంచిది', 51 - 100 'సంతృప్తికరమైనది', 101 - 200 'మితమైన', 201 - 300 'పూర్', 301 - 400 'చాలా దారుణం', 401 - 500 మధ్య 'తీవ్రమైనది'గా పరిగణించబడుతుంది. . IMD ప్రకారం, దేశ రాజధానిలో తేమ శాతం గురువారం ఉదయం 8.30 గంటలకు 70 శాతంగా నమోదైంది.

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?