![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Telangana Employees: తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ
![Telangana Employees: తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ Andhra Pradesh govenrment releaves Telangana employees to own state Telangana Employees: తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/27/f61feb8ce31d13b064d2d474715739261679912473177219_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Pradesh govenrment releaves Telangana employees | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి, తెలంగాణ ఏర్పాటై జూన్ 2తో పదేళ్లు ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా పలు రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. ఇటీవల ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు హైదరాబాద్ లో భేటీ అయి పరిష్కారం కాని విభజన సమస్యలపై చర్చించారు. ఈ క్రమంలో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం (ఆగస్టు 13న) ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి ఏపీ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను కేటాయించారు. వారిని స్వరాష్ట్రానికి పంపాలని ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం రిక్వెస్ట్ పై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ నుంచి రీలీవ్ అయ్యే ఉద్యోగులు తమ కేడర్ ర్యాంక్‌లోనే విధుల్లో చేరతారని ఉత్తర్వులలో పేర్కొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)