అన్వేషించండి

Chicken Piece: స్నేహితునితో పార్టీలో విషాదం - గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి

Rangareddy News: గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Man Died Due to Chicken Piece Stuck in His Throat: మృత్యువు ఎప్పుడు.. ఎవరికి.. ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేం. అలాంటి సంఘటనే రంగారెడ్డి (RangaReddy) జిల్లాలో బుధవారం జరిగింది. అప్పటివరకూ స్నేహితునితో సరదాగా పార్టీ చేసుకున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా ఊపిరాడక మృతి చెందాడు. పార్టీలో తిన్న చికెన్ సదరు వ్యక్తి ప్రాణం తీసింది. ఝార్ఖంఢ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారీ గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ (Farook Nagar) మండలం ఎలికట్ట (Elikatta) గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ బుధవారం రాత్రి దావత్ చేసుకుందామని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో చికెన్, పూరీ వండుకున్నారు. మద్యం సేవించి భోజనం చేస్తుండగా.. జితేంద్రకుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది చూసిన ధర్మేందర్ కు ఏం జరిగిందో అర్థం కాలేదు. మద్యం ఎక్కువగా తాగి ఉంటాడని, అందుకే స్పృహ కోల్పోయి ఉంటాడని భావించాడు. కాసేపటి తర్వాత అనుమానంతో జితేందర్ శ్వాస తీసుకోవడం లేదని గ్రహించిన ధర్మేందర్ అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించగా.. గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడంతో జితేందర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఘటనపై ధర్మేందర్ తివారీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలోనూ విషాదం

అనంతపురం (Ananthapuram) జిల్లా పెద్దవడుగూరు (Peddavaduguru) మండలం మల్లేనిపల్లెలో బుధవారం తీవ్ర విషాదం జరిగింది. గ్రామానికి చెందిన వాలంటీర్ సకీదీప, గోవిందరాజుల దంపతుల కుమార్తె జశ్విత (9 నెలలు) ఆడుకుంటూ ఇంటి వరండాలో పడిన నిమ్మకాయను నోట్లో పెట్టుకుంది. దీన్ని గమనించిన తల్లి వెంటనే దాన్ని బయటకు తీసేందుకు యత్నించింది. అయితే, అది చిన్నారి గొంతులోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో చిన్నారిని వెంటనే చికిత్స నిమిత్తం పెద్దవడుగూరు ఆస్పత్రికి తరలించారు. చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో మెరుగైన వైద్య కోసం పామిడి తరలించారు. అయితే, చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలోనూ తీవ్ర విషాదం నెలకొంది. ఏడేళ్ల తర్వాత ఆ దంపతులకు బిడ్డ పుట్టిందని.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తరుణంలో ఆ చిన్నారికి ఇలా జరిగిందని స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. 

Also Read: Ganza Siezed: ట్రావెల్స్ బస్సుల్లో గంజాయి తరలింపు - 30 కిలోలు స్వాధీనం, 10 మంది అరెస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US New President Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Indians In America Elections 2024:అమెరికా ఎన్నికల్లో భారతీయం- గెలిచిన భారతీయ సంతతి వ్యక్తులెవరో తెలుసా?
అమెరికా ఎన్నికల్లో భారతీయం- గెలిచిన భారతీయ సంతతి వ్యక్తులెవరో తెలుసా?
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఢిల్లీకి వెళ్తున్న పవన్ కళ్యాణ్, రీజన్ ఇదేనా?నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US New President Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Indians In America Elections 2024:అమెరికా ఎన్నికల్లో భారతీయం- గెలిచిన భారతీయ సంతతి వ్యక్తులెవరో తెలుసా?
అమెరికా ఎన్నికల్లో భారతీయం- గెలిచిన భారతీయ సంతతి వ్యక్తులెవరో తెలుసా?
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
US Election Elon Musk: గెలిచింది ట్రంప్ - గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్
గెలిచింది ట్రంప్ - గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్
Donald Trump Properties: బిలియన్ డాలర్ల ఆస్తులు, కోట్ల విలువైన కార్లు - డొనాల్డ్ ట్రంప్‌ సంపద ఎంతో తెలుసా?
బిలియన్ డాలర్ల ఆస్తులు, కోట్ల విలువైన కార్లు - డొనాల్డ్ ట్రంప్‌ సంపద ఎంతో తెలుసా?
Telangana Survey: 75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
Donald Trump News: అమెరికాలో స్వర్ణయుగం చూస్తాం- విజయం తర్వాత ట్రంప్ తొలి ప్రసంగం
అమెరికాలో స్వర్ణయుగం చూస్తాం- విజయం తర్వాత ట్రంప్ తొలి ప్రసంగం
Embed widget