అన్వేషించండి

22A Land Declaration: 222A నిషేధిత భూమిగా ఎలా ప్రకటిస్తారు.. నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

22A Land Declaration: 22A భూముల ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 22A నిషేధిత జాబితాలో భూములు పెట్టటానికి కొన్ని నిబంధనలు ఉన్నాయని తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 22A నిషేధిత భూముల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
  • ULC మిగులు, లేఅవుట్ సమస్యల పరిష్కారానికి కొత్త విధానాలు.
  • సింగరేణి భూ సమస్యలకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తారు.

22A Land Declaration: నిషేధిత భూములు 22Aపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏ భూమిని అయినా 22A నిషేధిత జాబితాలో పెట్టటానికి కొన్ని నిబంధనలు, విచారణలు ఉన్నాయని తెలిపారు. 22A నిషేధిత భూమిగా ప్రకటించే ముందు ఎలాంటి నిబంధనలు, విచారణలు చేస్తారో సీఎం వివరించారు.  

హైపవర్ కమిటీ 

రాష్ట్రంలో 22 A కింద నిషేధిత జాబితాలో నిరుపేదలకు సంబంధించిన ఆస్తులపై 30 రోజుల్లోగా న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీఎం  రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. 22ఏ నిషేధిత జాబితా వివాదాల పరిష్కారానికి సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నతాధికారితో కూడిన హైపవర్ ఆఫీసర్స్ కమిటీని నియమిస్తున్నట్టు తెలిపారు. జాబితా 22A పై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చపై ముఖ్యమంత్రి సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు భూములకు సంబంధించి చేసిన చట్టాలు, వాటి చారిత్రక పరిణామ క్రమాన్ని సభలో వివరించారు.

న్యాయమైన, చట్టబద్ధమైన అంశాల్లో నిరుపేదలకు అన్యాయం జరక్కుండా అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రధానంగా ప్రభుత్వం గుర్తించిన 12 అంశాల్లో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఆ 12 అంశాలను సభలో వెల్లడించారు.

2A నిషేధిత భూమిగా ప్రకటించే విధానం

1. 22A భూముల వివాదానికి సంబంధించి సబ్ కలెక్టర్, ఆర్డీవో మాత్రమే విచారణ ప్రారంభిస్తారు. 
2. గ్రామాలు అయితే భూ సర్వే నెంబర్, సబ్ డివిజన్, విస్తీర్ణం, పట్టాదారు, యజమాని వివరాలు అధికారులు గుర్తిస్తారు.
3. పట్టణ ప్రాంతాల్లో వార్డు, బ్లాక్, ప్లాట్, డోర్ నెంబర్ వివరాలు నమోదు చేస్తారు.
4. రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్ సంబంధిత భూ రికార్డుల వివరాలు సేకరించి వాటిని అధికారులు పరిశీలిస్తారు. భూమి పరిస్థితిపై నిర్థారణకు వస్తారు. 
5. మొత్తం భూమిలో కొంత భాగం మాత్రమే నిషేధిత భూమిలో ఉంటే ఆ భాగాన్ని మాత్రమే 22Aలో చేరుస్తారు. మిగతా భూమిని 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు అధికారులు. 
6. భూయజమానికి ముందుగా నోటీసలు జారీ చేస్తారు. అందుబాటులో లేకపోతే ఈ-మెయిల్ లేదా ఆధార్‌కు లింక్ అయిన అడ్రస్‌కు రిజిస్టర్ పోస్ట్ చేస్తారు.
7. ఈ ప్రాసెస్ పూర్తైన తర్వాత అవసరం అయితే స్థానిక వార్తాపత్రికల్లో ప్రకటన ఇస్తారు. భూ యజమానికి 15 రోజుల సమయం ఇస్తారు.
8. ఈ సమయంలో భూయజమాని.. తన భూమిని నిషేధిత జాబితాలో పెట్టకుండా కాపాడుకోవచ్చు.
9. సబ్ కలెక్టర్, ఆర్డీవో విచారణ మొత్తాన్ని, సంబంధిత డాక్యుమెంట్లను ఆడియో కాపీతో సహా ఆర్డర్ కాపీని సంబంధిత వ్యక్తి అందిస్తారు. 
10. 22A జాబితాకు సంబంధించి వ్యవసాయ భూమి విస్తీర్ణం ఒక  ఎకరానికి మించి, వ్యవసాయేతర భూమి అయితే వెయ్యి గజాలకు మించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. 
11. ఈ విచారణ పూర్తైన తర్వాత.. ఆ భూమిని 22A నిషేధిత జాబితాలో చేరుస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన తర్వాతే ఆ వివరాలను IGRS రికార్డుల్లో నమోదు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ డేటా బేస్‌లో ఆన్‌లైన్‌లో చేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 22A నిషేధిత జాబితాలోకి ఎక్కడ కూడా మ్యాన్యువల్‌గా చేరుస్తామన్నారు.  

'పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం (ULC) మిగులు భూముల క్రమబద్ధీకరణ కోసం నూతన విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.  ఈ పథకం పెండింగ్ లో ఉన్న పాత దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులన్నింటికీ వర్తిస్తుంది. భూముల రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ ప్రక్రియలు రెండూ సమాంతరంగా, ఏకకాలంలో చేపడతాం' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  

Also Read: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. 30 రోజులు డెడ్‌లైన్

'కాంపిటెంట్ అథారిటీ ఆమోదించిన లేఅవుట్లలో పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పరిశీలించి, తగిన పరిష్కారం చూపేందుకు వారం రోజుల్లోగా ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తాం. ఇలాంటి ఆస్తుల క్రమబద్ధీకరణ త్వరగా పూర్తి చేసేందుకు నూతన పథకాన్ని ప్రవేశ పెడతాం. సింగరేణి బొగ్గు గని ప్రాంతాల సమస్యకు పరిష్కరించడానికి జిల్లా స్థాయి ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ పెండింగ్ లో ఉన్న అన్ని దరఖాస్తులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, నిర్దేశిత అర్హతా ప్రమాణాల మేరకు పరిష్కరిస్తుంది' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

Also Read: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

 

Frequently Asked Questions

22A నిషేధిత భూమిగా ప్రకటించే విచారణను ఎవరు ప్రారంభిస్తారు?

22A భూముల వివాదానికి సంబంధించి సబ్ కలెక్టర్ లేదా ఆర్డీవో మాత్రమే విచారణ ప్రారంభిస్తారు. భూమిని నిషేధిత జాబితాలో పెట్టే ముందు నిబంధనలు, విచారణలు ఉంటాయి.

22A నిషేధిత జాబితాలో భూమిని చేర్చే ముందు యజమానికి నోటీసులు ఎలా అందిస్తారు?

ముందుగా భూయజమానికి నోటీసులు జారీ చేస్తారు. అందుబాటులో లేకపోతే, ఈ-మెయిల్ ద్వారా లేదా ఆధార్‌కు లింక్ అయిన చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందిస్తారు. అవసరమైతే స్థానిక వార్తాపత్రికల్లో ప్రకటన ఇస్తారు.

22A నిషేధిత జాబితాలో భూమిని చేర్చిన తర్వాత దాని వివరాలను ఎక్కడ నమోదు చేస్తారు?

విచారణ పూర్తయి, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన తర్వాత, ఆ వివరాలను IGRS రికార్డులలో నమోదు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ డేటా బేస్‌లో కూడా ఆన్‌లైన్‌లో చేరుస్తారు.

పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం (ULC) మిగులు భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది?

ప్రభుత్వం త్వరలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం పాత, కొత్త దరఖాస్తులన్నింటికీ వర్తిస్తుంది, రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ ప్రక్రియలు సమాంతరంగా జరుగుతాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Special Trains: విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
విజయవాడ - విశాఖ మధ్య సహా పలు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ – నహర్లగూన్ స్పెషల్ సర్వీస్
Kavya Maran and Anirudh Wedding: కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget