అన్వేషించండి

YouTube Music And Premium: యూట్యూబ్ మ్యూజిక్ కొత్త మైలురాయి - ఒకే సంవత్సరంలో ఏకంగా 30 మిలియన్లు!

యూట్యూబ్ మ్యూజిక్, ప్రీమియం సేవలు ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

యూట్యూబ్ మ్యూజిక్, ప్రీమియం ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటింది. అయితే ఇందులో ట్రయల్ యూజర్లు కూడా ఉన్నారు. దీంతో స్పాటిఫై సరసన చేరినట్లు గూగుల్ ప్రకటించింది. ఏడాది క్రితం ఈ సంఖ్య 50 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లుగా ఉంది. దీంతోపాటు స్పాటిఫై కలెక్షన్‌ను కూడా యూట్యూబ్ మ్యూజిక్ చేరుకుంది. ఇప్పుడు ఈ రెండిటి వద్ద చెరో 80 మిలియన్ల కలెక్షన్ ఉంది.

ఈ నెల ప్రారంభంలో అమెజాన్ మ్యూజిక్ 100 మిలియన్ల ట్రాక్‌ను దాటింది. దీంతో యాపిల్ మ్యూజిక్ తర్వాత ఈ మార్కును చేరుకున్న మ్యూజిక్ సర్వీస్‌గా నిలిచింది. రెండు మిలియన్ల నుంచి 100 మిలియన్లకు అమెజాన్ మ్యూజిక్ కలెక్షన్ చేరడం విశేషం..

"సెప్టెంబర్ 2022 నాటికి యూట్యూబ్ ట్రయల్‌లో ఉన్న వారితో సహా ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల మ్యూజిక్, ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లను అధిగమించింది. గత సంవత్సరం ఈ సంఖ్య 50 మిలియన్ల వద్ద ఉండగా ఏకంగా 30 మిలియన్ల మంది ఒకే సంవత్సరంలో పెరిగారు." అని యూట్యూబ్ గ్లోబల్ హెడ్ ఆఫ్ మ్యూజిక్ లియర్ కోహెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

YouTube గ్లోబల్ హెడ్ ఆఫ్ మ్యూజిక్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్ బేస్‌ను చేరుకోవడంలో మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు, స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో భాగస్వామ్యాలు సహాయపడ్డాయి.

"మేం పార్ట్‌నర్‌షిప్ పవర్‌ని అర్థం చేసుకున్నాము. YouTube Music, YouTube Premium ప్రారంభించినప్పటి నుండి, Samsung వంటి కంపెనీలు, సాఫ్ట్‌బ్యాంక్ (జపాన్), Vodafone (యూరోప్), LG U+ (కొరియా), Google సేవల వంటి క్యారియర్‌లతో భాగస్వామ్యాన్ని నిర్మించాము. ఈ 80 మిలియన్ల సబ్‌స్క్రైబర్ మైలురాయిని చేరుకోవడంలో మాకు సహాయపడడంలో ఈ భాగస్వాములు కీలకంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం సంగీత అనుభవాన్ని మెరుగుపరచడంలో మాకు సహాయం చేస్తూనే ఉంటారు." అని కోహెన్ జోడించారు.

ఆటో రెన్యువల్ లేకుండా ఒక నెల బేసిక్ YouTube ప్రీమియం ప్లాన్ భారతదేశంలో రూ.139గా ఉంది. అదే ఆటో రెన్యువల్ ఉంటే రూ.129 మాత్రమే. దీంతోపాటు ఒక నెల ఉచిత యాక్సెస్ కూడా లభించనుంది. సబ్‌స్క్రైబర్‌లు తమ YouTube ప్రీమియం సభ్యత్వాన్ని ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. త్రైమాసిక సబ్‌స్క్రిప్షన్ ఫీజు రూ.399, వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర రూ.1,290గా ఉంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by YouTube (@youtube)

టాప్ హెడ్ లైన్స్

Apple iPhone 18 Pro Sales EMI: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
Embed widget