Youtube Ad Blockers: యాడ్ బ్లాకర్స్‌తో యూట్యూబ్ చూస్తున్నారా? - అయితే మీకు బ్యాడ్ న్యూస్! - ఇక నుంచి!
యాడ్ బ్లాకర్లతో యూట్యూబ్ యాక్సెస్ చేయకుండా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. ఇకపై అలా చేయడం చాలా కష్టం.
Youtube Ad Blockers: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, నంబర్ వన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌నే. ఎంతో కంటెంట్ ఉచితంగా అందుబాటులో లభించే యూట్యూబ్ రన్ అవ్వాలంటే చాలా ఖర్చు అవుతుంది. ప్రతి 60 సెకన్లకు దాదాపు 500 గంటల కంటెంట్.. గూగుల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌కి అప్‌లోడ్ అవుతోంది. వీడియోలు మనం చూసేటప్పుడు వచ్చే ప్రకటనల నుంచే కంపెనీ డబ్బు సంపాదిస్తుంది.
మనం ఈ యాడ్స్‌ను చూడటం మానేస్తే యూట్యూబ్ ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. ఈ ఆదాయాన్ని పెంచుకునేందుకు కంపెనీ ఓ పెద్ద అడుగు వేసింది. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు ఉపయోగించే వారు యూట్యూబ్ యాడ్స్ రాకుండా యాడ్ బ్లాకర్లు ఉపయోగించడం సాధారణమైన విషయమే. ఇప్పుడు యూట్యూబ్ ఈ యాడ్స్ బ్లాకర్‌ని బ్లాక్ చేయబోతోంది. ఇప్పటి వరకు చాలా మంది యాడ్స్ బ్లాకర్ ఆన్ చేసి యూట్యూబ్‌లో వీడియోలు చూసేవారు. దీంతో వారు ప్రకటనలు లేకుండానే కంటెంట్ చూడవచ్చు. యూట్యూబ్ ప్రీమియం చెల్లించకుండా నేరుగా దాని ప్రయోజనాన్ని పొందవచ్చు.
అయితే ఇప్పుడు కంపెనీ యాడ్స్ బ్లాకర్‌ను బ్లాక్ చేయబోనుంది. ఈ ప్రోగ్రామ్ ప్రపంచ స్థాయిలో ఇప్పటికే ప్రారంభం అయింది. మీరు ఇప్పటి వరకు యూట్యూబ్‌లో కంటెంట్‌ని యాడ్ బ్లాకర్స్ ఆన్ చేసి చూస్తూ ఉంటే, ఇకనుంచి మీరు అలా చేయలేరు. ఒకవేళ యాడ్ బ్లాకర్‌ని ఆన్‌లో ఉంచితే, యూట్యూబ్‌ని యాక్సెస్ చేయలేరు.
యాడ్ బ్లాకర్‌ని ఆన్‌లో ఉంచుకుంటే ఏం జరుగుతుంది?
యూట్యూబ్ ద్వారా యాడ్ బ్లాకర్‌ని ఆన్ చేసినప్పుడు, కంపెనీ నియమాలకు వ్యతిరేకంగా మీరు ప్లాట్‌ఫారమ్‌లో యాక్టివ్‌గా ఉన్నారని చెప్పే ఫ్లాష్ మెసేజ్ మీకు డిస్‌ప్లే అవుతుంది. అంటే మీరు యాడ్స్ బ్లాకర్ ఆన్‌లో ఉంటే యూట్యూబ్‌లో వీడియోలను చూడలేరు. ‘రెడిట్’లోని కొంతమంది వినియోగదారులు మూడు వీడియోల తర్వాత యూట్యూబ్ బ్లాక్ అవుతుందనే మెసేజ్‌ని కూడా చూశారు. అంటే మీరు యాడ్ బ్లాకర్ ఆన్ చేసి వీడియోను చూస్తున్నట్లయితే, మూడు వీడియోల తర్వాత యూట్యూబ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.
కంపెనీ డిస్‌ప్లే చేసిన ఫ్లాష్ మెసేజ్‌లో యూట్యూబ్ ప్రీమియం తీసుకోమని లేదా ప్రకటనలను ఆన్ చేయమని అడుగుతారు. మీరు ఈ ఆప్షన్లలో దేనినైనా ఎంచుకోవచ్చు. మీరు ప్రీమియం తీసుకోకుండా యూట్యూబ్ చూడాలనుకుంటే, యాడ్స్ ఆన్ చేయడం ద్వారా వీడియోలు చూడవచ్చు.
ది వెర్జ్ కథనం ప్రకారం, యూట్యూబ్ నిబంధనలను యాడ్ బ్లాకర్ ఉల్లంఘిస్తుందని యూట్యూబ్ కమ్యూనికేషన్స్ మేనేజర్ క్రిస్టోఫర్ లాటన్ చెప్పారు. ప్రకటనలను బ్లాక్ చేయడం ద్వారా వీడియోలను చూసే వినియోగదారులకు యూట్యూబ్‌లో యాడ్స్‌ను అనుమతించమని లేదా యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ కోసం యూట్యూబ్ ప్రీమియం ట్రై చేయమని కంపెనీ ప్రపంచవ్యాప్త ప్రయత్నాన్ని ప్రారంభించింది. ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా క్రియేటర్స్ ఎకో సిస్టంను సపోర్ట్ చేస్తాయని, యూట్యూబ్‌లో బిలియన్ల మంది ప్రజలు తమకు ఇష్టమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి యాడ్స్ సాయపడతాయని ఆయన అన్నారు.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?