అన్వేషించండి

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ప్రపంచ నంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మూడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకురానుంది.

వాట్సాప్ తన వినియోగదారుల కోసం మూడు కొత్త ఫీచర్లను తీసుకురానుంది. దీంతో వినియోగదారులకు మరింత ప్రైవసీ లభించనుంది. వాట్సాప్ ట్విట్టర్ పేజీలో ఈ మూడు ఫీచర్లను షేర్ చేసింది. మెటా సీఈవో, ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఈ ఫీచర్లను షేర్ చేశారు. ఆ మూడు ఫీచర్లు ఇవే.

గ్రూపు సభ్యులకు తెలియకుండా ఎగ్జిట్ అయిపోవచ్చు
వీటిలో మొదటిది గ్రూపుల నుంచి ఎగ్జిట్ అవ్వడం గురించి. సాధారణంగా మనం ఏవైనా గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయితే వెంటనే గ్రూపు ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మీరు గ్రూపు నుంచి ఎగ్జిట్ అయిన విషయం ఎవరికీ తెలియదు. కేవలం గ్రూప్ అడ్మిన్స్‌కు మాత్రమే తెలుస్తుంది.

ఆన్‌లైన్‌లో ఉన్నా అందరికీ కనిపించదు
మనం వాట్సాప్‌లో లాస్ట్ సీన్ ఆఫ్ చేసినప్పటికీ ఆన్‌లైన్‌లో ఉంటే ఆ విషయం అవతలివారికి తెలుస్తుంది. కానీ వాట్సాప్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తే మనం ఆన్‌లైన్‌లో ఉన్నా ఎవరికీ తెలియకుండా ప్రైవసీ ఫీచర్స్ మార్చుకోవచ్చు. అందులోనూ మనం కొందరికి మాత్రమే కనిపించేలా కూడా సెట్ చేసుకోవచ్చు.

ఫొటోలు స్క్రీన్ షాట్ తీయడం కూడా కష్టమే
సాధారణంగా ప్రస్తుతం వాట్సాప్‌లో ఫొటోలు పంపితే అవి ఫోన్‌లో స్టోర్ అవుతాయి. వాట్సాప్ కొత్తగా ‘View Once’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఫొటో ఒక్కసారి చూడటానికి మాత్రమే వీలు అవుతుంది. అయితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు. కానీ వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువస్తే వ్యూ వన్స్ ద్వారా పంపిన ఫొటోను స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా అవ్వదు.

ఈ మూడు ఫీచర్లు వాట్సాప్ యూజర్లు ఎప్పటినుంచో కోరుకుంటున్నవే. వీటి ద్వారా వాట్సాప్‌లో ప్రైవసీ మరింత పెరగనుంది. వాట్సాప్ గ్రూప్‌లో పెట్టే మెసేజ్‌లను అడ్మిన్ డిలీట్ చేసే ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే అడ్మిన్ ఏదైనా మెసేజ్‌ను గ్రూప్‌లో నుంచి డిలీట్ చేస్తే ఆ మెసేజ్‌ను అడ్మిన్ డిలీట్ చేసినట్లు అక్కడ కనిపిస్తుంది.

వాట్సాప్ బీటా v2.22.17.12 వెర్షన్‌లో ఈ ఫీచర్ కనిపించినట్లు WABetaInfo వెబ్‌సైట్ కథనం ద్వారా తెలిసింది. ఈ ఫీచర్‌ను కొంతమంది టెస్టర్లకు ఇప్పటికే పంపించినట్లు తెలుస్తోంది. త్వరలో స్టేబుల్ వెర్షన్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి గ్రూపులో మెసేజ్‌లను డిలీట్ చేసే యాక్సెస్ కేవలం ఆ మెసేజ్ పంపిన వారికి మాత్రమే ఉంది. ఇప్పుడు గ్రూప్ అడ్మిన్లకు కూడా ఆ ఫీచర్‌ను అందిస్తున్నారు. అంటే గ్రూప్‌లో ఎవరైనా అభ్యంతరకరమైన మెసేజ్‌లు పెడితే అడ్మిన్స్ వాటిని డిలీట్ చేయవచ్చన్న మాట.

వాట్సాప్ రియాక్షన్స్ ఫీచర్‌ను మెటా ఇటీవలే అప్‌డేట్ చేసింది. మొదట్లో లైక్, లవ్, లాఫ్, సర్‌ప్రైజ్, శాడ్, థ్యాంక్స్ రియాక్షన్లు మాత్రమే అందించేవారు. ఇప్పుడు వాట్సాప్‌లో ఏ ఎమోజీతో అయినా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ను వాట్సాప్ నాలుగు సంవత్సరాల పాటు పరీక్షించింది. ఎట్టకేలకు మేలో అందుబాటులోకి తీసుకువచ్చింది. మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేవరెట్ ఎమోజీలను కూడా తెలిపాడు. రోబోట్ ఫేస్, ఫ్రెంచ్ ఫ్రైస్, మ్యాన్ సర్ఫింగ్, సన్‌గ్లాసెస్ స్మైలీ, 100 పర్సెంట్ సింబల్, ఫిస్ట్ బంప్ ఎమోజీలను షేర్ చేశాడు.

టాప్ హెడ్ లైన్స్

Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
Google Account Security: మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
BRS Leaders Arrest: కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
రూ.65 వేల నుంచి లక్ష ధరలో హోండా టూవీలర్స్‌.. షైన్‌, యాక్టివ్‌, డియో, లివో మోడళ్లు
రూ.లక్ష లోపే కొనగలిగే హోండా బైక్ లేదా స్కూటర్.. మీ కోసం 10 రకాల టూవీలర్లు
Live Murder in Hyderabad: నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
Alla Nani Passes Away: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
Piles Types and Grades : పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Embed widget