అన్వేషించండి

Vivo X100 Ultra: వివో ఎక్స్100 సిరీస్‌లో కొత్త ఫోన్లు రెడీ - లాంచ్ ఎప్పుడంటే?

Vivo X100s: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. ఇందులో వివో ఎక్స్100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో ఫోన్లు ఉండనున్నాయి.

Vivo X100s Pro: వివో ఎక్స్100 సిరీస్‌లో కొత్త ఫోన్లు చైనాలో వచ్చే వారం లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్‌లో వివో ఎక్స్100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో ఫోన్లు ఉండనున్నాయి. వీటికి సంబంధించిన ప్రీ-రిజర్వేషన్లు చైనాలో ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. వీటిలో 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ ఉండనున్నాయి. దీనికి సంబంధించిన ధరలు కూడా ఇప్పుడు లీకయ్యాయి.

మే 13వ తేదీన లాంచ్...
వివో ఎక్స్100 అల్ట్రా (Vivo X100 Ultra), వివో ఎక్స్100ఎస్ (Vivo X100s), వివో ఎక్స్100 ప్రో స్మార్ట్ ఫోన్లు మే 13వ తేదీన లాంచ్ కానున్నట్లు వీబో ద్వారా కంపెనీ రివీల్ చేసింది. ఈ మూడు ఫోన్లకు సంబంధించిన కలర్ ఆప్షన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వివో ఎక్స్100 అల్ట్రా, ఎక్స్100ఎస్ ప్రో ఫోన్లను స్పేస్ గ్రే, టైటానియం, వైట్ మూన్‌లైట్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. వివో ఎక్స్100ఎస్‌ స్పేస్ గ్రే, బ్లూ క్లౌడ్, టైటానియం, వైట్ మూన్‌లైట్ రంగుల్లో అందుబాటులో ఉంది. వీటిలో జీస్ బ్రాండెడ్ కెమెరాలు ఉన్నాయి.

1 టీబీ వరకు స్టోరేజ్
చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ పోస్టు ప్రకారం... వివో ఎక్స్100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్ ఫోన్లు మూడు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇక వివో ఎక్స్100ఎస్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ మోడల్స్‌లో అందుబాటులో ఉండనుందని సమాచారం.

Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది 

ధర ఎంత ఉండవచ్చు?
భారతీయ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ల ధరలను లీక్ చేశాడు. దీని ప్రకారం వివో ఎక్స్100 అల్ట్రా (Vivo X100 Ultra Price) ధర 6,699 చైనీస్ యువాన్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.77,500) నుంచి ప్రారంభం కానుంది. వివో ఎక్స్100ఎస్ ధర (Vivo X100s Price) 3,999 చైనీస్ యువాన్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.46,200) నుంచి, వివో ఎక్స్100ఎస్ ప్రో (Vivo X100 Pro Price) ధర 4,999 చైనీస్ యువాన్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.57,000) నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ఇండియా లాంచ్ ఉంటుందా? (Vivo X100 Ultra India Launch)
చైనాలో వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రోలకు సంబంధించిన సేల్ మే 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వివో ఎక్స్100 అల్ట్రా సేల్ మే 28 నుంచి జరగనుంది. మనదేశంలో ఈ ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలియరాలేదు. కానీ కచ్చితంగా లాంచ్ అవుతాయని మాత్రం చెప్పవచ్చు.

Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు

టాప్ హెడ్ లైన్స్

CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget