అన్వేషించండి

Tecno Spark 20C: రూ.8 వేలలోపే 16 జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ కెమెరా - టెక్నో స్పార్క్ 20సీ వచ్చేసింది!

Tecno Spark 20C Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే టెక్నో స్పార్క్ 20సీ.

Tecno New Phone: టెక్నో స్పార్క్ 20సీ (Tecno Spark 20C) మనదేశంలో లాంచ్ అయింది. 2023 నవంబర్‌లో గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డైనమిక్ పోర్టు ఫీచర్లను కూడా అందించారు. ఆక్టాకోర్ చిప్‌సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఒకే ఒక్క స్టోరేజ్ వేరియంట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

టెక్నో స్పార్క్ 20సీ ధర (Tecno Spark 20C Price in India)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.8,999గా నిర్ణయించారు. దీంతోపాటు కంపెనీ లాంచ్ ఆఫర్‌ను కూడా అందిస్తుంది. ఈ లాంచ్ ఆఫర్ ద్వారా రూ.7,999కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. మార్చి 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కేవలం అమెజాన్‌లో మాత్రమే దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.5,604 విలువైన ఓటీటీ ప్లే వార్షిక సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనున్నట్లు కంపెనీ తెలిపింది.

టెక్నో స్పార్క్ 20సీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Tecno Spark 20C Specifications)
టెక్నో స్పార్క్ 20సీ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ స్క్రీన్ అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహాలో ఇందులో డైనమిక్ పోర్టు ఉంది. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు అందులో చూడవచ్చు.

గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇందులో డార్విన్ ఇంజిన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ర్యామ్‌ను ఇన్‌బిల్ట్‌గా అందించగా... దీన్ని వర్చువల్‌గా మరో 8 జీబీ పెంచుకోవచ్చు. 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కాగా, మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా దీన్ని మరో 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత హైఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో స్పార్క్ 20సీ రన్ కానుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెర సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు ఏఐ సెన్సార్ కూడా ఉంది. 1080పీ టైమ్ ల్యాప్స్ వీడియోలను దీంతో రికార్డు చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 50 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం వరకు ఛార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ అంటోంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంది. టెక్నో ఇటీవలే మనదేశంలో ఎన్నో బడ్జెట్ ఫోన్లు లాంచ్ చేసింది. వీటిలో ఇది కూడా ఒకటి.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget