అన్వేషించండి

Tecno Pova 6 Pro 5G Sale: ఎంతో హైప్‌తో మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - సేల్ ప్రారంభం!

Tecno Pova 6 Pro 5G: టెక్నో పోవా 6 ప్రో 5జీ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.

Tecno Pova 6 Pro 5G Amazon Sale: టెక్నో పోవా 6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఇందులో 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉండటం విశేషం. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై టెక్నో పోవా 6 ప్రో 5జీ పని చేయనుంది. 70W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో చూడవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు ర్యామ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

టెక్నో పోవా 6 ప్రో 5జీ ధర, ఆఫర్లు (Tecno Pova 6 Pro 5G Amazon Sale)
ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.21,999 ఉంది. ప్రారంభ ఆఫర్ కింద టెక్నో పోవా 6 ప్రో 5జీని ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు అందించనున్నారు. అంతే కాకుండా రూ.4,999 విలువైన టెక్నో ఎస్2 స్పీకర్‌ను ఉచితంగా అందించనున్నారు. కామెట్ గ్రీన్, మీటియోరైట్ గ్రే రంగుల్లో టెక్నో పోవా 6 ప్రో 5జీ లాంచ్ అయింది.

టెక్నో పోవా 6 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు (Tecno Pova 6 Pro 5G Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ రన్ కానుంది. టెక్నో పోవా 6 ప్రో 5జీలో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌పై టెక్నో పోవా 6 ప్రో 5జీ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్ అందుబాటులో ఉండగా, దీన్ని వర్చువల్‌గా మరో 12 జీబీ పెంచుకునే అవకాశం ఉంది. 8 జీబీ ర్యామ్ వేరియంట్లో 8 జీబీ వరకు మాత్రమే పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... టెక్నో పోవా 6 ప్రో 5జీ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, మరో ఏఐ ఆధారిత లెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం టెక్నో పోవా 6 ప్రో 5జీలో ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. 

Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు

ఇందులో డైనమిక్ పోర్టు 2.0 ఫీచర్ అందించారు. యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహాలో ఇది పని చేస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్పీకర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 70W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 5జీ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. టెక్నో పోవా 6 ప్రో 5జీ మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 195 గ్రాములుగా ఉంది.

Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది

టాప్ హెడ్ లైన్స్

Washing Machines: ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది బెటర్? మోటార్, వాటర్, స్పిన్ స్పీడ్ తేడాలు ఇవే!
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది బెటర్? మోటార్, వాటర్, స్పిన్ స్పీడ్ తేడాలు ఇవే!
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget