అన్వేషించండి

Samsung Galaxy M15 5G: 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో కొత్త 5జీ ఫోన్ - శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఎలా ఉంది?

Samsung New Phone: శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది.

Samsung Galaxy M15 5G Launched: శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ స్మార్ట్ ఫోన్ సైలెంట్‌గా గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌ ఆక్టా కోర్ ప్రాసెసర్‌పై పని చేయనుంది. దీని వెనకవైపు మూడు కెమెరాల సెటప్‌ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. మూడు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వాటర్ డ్రాప్ తరహా డిస్‌ప్లే డిజైన్‌ను ఈ ఫోన్‌లో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ సపోర్ట్ చేయనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ధర
ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ఇంకా అధికారిక వెబ్ సైట్లలో లిస్ట్ చేయలేదు. కానీ త్వరలో ఈ ధర వివరాలు కూడా రివీల్ అయ్యే అవకాశం ఉంది. గ్రే, డార్క్ బ్లూ, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దాదాపుగా ఇదే ఫీచర్లతో గతేడాది మనదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ లాంచ్ అయింది. దీని ధరను రూ.19,499గా నిర్ణయించారు. కాబట్టి శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ధర కూడా రూ.20 వేలలోపే ఉండే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ స్పెసిఫికేషన్లు
ఈ డ్యూయల్ నానో సిమ్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, విజన్ బూస్టర్ ఫీచర్లు కూడా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుందని సమాచారం. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు సెన్సార్లు కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ, జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, వైఫై, బ్లూటూత్ వీ5.3, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, గైరో సెన్సార్, జియోమ్యాగ్నటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్లను అందించారు. ఆథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే 128 గంటల ఆడియో ప్లేబ్యాక్, 22 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ అందిస్తుందని కంపెనీ అంటోంది. దీని మందం 0.93 సెంటీమీటర్లు కాగా, బరువు 217 గ్రాములుగా ఉంది.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget