అన్వేషించండి

Redmi Note 11: రెడ్‌మీ నోట్ 11 సిరీస్ వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. సూపర్ డిజైన్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన రెడ్‌మీ నోట్ సిరీస్‌లో కొత్త ఫోన్లు లాంచ్ చేయనుంది. అవే రెడ్‌మీ నోట్ 11 సిరీస్. అక్టోబర్ 28వ తేదీన ఇవి లాంచ్ కానున్నాయి.

రెడ్‌మీ నోట్ 11 స్మార్ట్ ఫోన్లు అక్టోబర్ 28వ తేదీన లాంచ్ కానున్నాయి. ఇప్పుడు లాంచ్‌కు ముంగిట ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రోలతో పాటు రెడ్‌మీ నోట్ 11 కూడా లాంచ్ కానుంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. మ్యాట్ ఫినిష్ కూడా వెనకవైపు ఉండనుంది. దీని టీజర్ల ప్రకారం.. ఇందులో మిస్టీ ఫారెస్ట్ అనే కొత్త కలర్ వేరియంట్ కూడా ఉండనుంది. జేబీఎల్ ఆడియో కూడా ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది.

షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ దీనికి సంబంధించిన పలు టీజర్లను కూడా ఇప్పటికే విడుదల చేసింది. ఈ టీజర్లలో రెడ్‌మీ నోట్ 11 స్మార్ట్ ఫోన్‌ను వెనకనుంచి చూడవచ్చు. ఈ టీజర్‌లోనే ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉండనున్నాయి. ఇందులో ఐఆర్ బ్లాస్టర్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్‌ను కూడా చూడవచ్చు.

ఫోన్ కిందవైపు యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ ఉండనున్నాయి. ఇందులో వాల్యూమ్ రాకర్, పవర్/లాక్ కీ కూడా ఉండనున్నాయి. పవర్/లాక్ కీకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాకుండా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనున్నారన్న మాట.

ఫోన్ వెనకవైపు యాంటీ గ్లేర్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కూడా రెడ్‌మీ అందించింది. దీనికి మ్యాట్ ఫినిష్ కూడా ఉంది. దీని మందం 0.83 సెంటీమీటర్లుగా ఉండే అవకాశం ఉంది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్ చైనాలో అక్టోబర్ 28వ తేదీన లాంచ్ కానుంది. రెడ్‌మీ నోట్ సిరీస్ మనదేశంలో కూడా బాగా పాపులర్ కాబట్టి త్వరలో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

చైనాలో జేడీ.కాం వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ఇప్పటికే కనిపించింది. దీనికి సంబంధించిన ప్రీ-సేల్ కూడా ఇప్పుడు చైనాలో జరుగుతోంది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌తో పాటు రెడ్‌మీ వాచ్ 2 కూడా వచ్చేశారం లాంచ్ కానుంది. ఇందులో చదరపు ఆకారంలో ఉన్న అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇవి మనదేశంలో లాంచ్ అయితే ధర రూ.20 వేలలోపే ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో రెడ్‌మీ అందించే ఫోన్లు ఆ ధరలో ఎప్పుడూ బెస్ట్‌గానే ఉంటాయి.

Also Read: Oppo K9s: ఒప్పో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర బడ్జెట్‌లోనే.. అదిరిపోయే లుక్!

Also Read: Apple Macbook Pro 2021: మోస్ట్ పవర్‌ఫుల్ యాపిల్ ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. ధర ఎంతో తెలుసా?

Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
Google Account Security: మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Embed widget