అన్వేషించండి

Realme P1 5G Series: రియల్‌మీ పీ1 5జీ సిరీస్ వచ్చేసింది - రూ.15 వేలలోనే సూపర్ ఫోన్!

Realme P1 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన పీ1 5జీ సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసింది. బడ్జెట్ 5జీ మొబైల్స్‌‌గా ఇవి మార్కెట్లోకి వచ్చాయి.

Realme P1 Pro 5G: రియల్‌మీ పీ1 5జీ సిరీస్ ఫోన్లు మనదేశంలో సోమవారం లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో రియల్‌మీ పీ1 5జీ, రియల్‌మీ పీ1 ప్రో 5జీ ఫోన్లు ఉన్నాయి. గ్లాసీ, స్పార్క్లింగ్, ఫీనిక్స్ డిజైన్‌తో ఇవి మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. వీటిలో బేస్ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను అందించారు. హై ఎండ్ ప్రో వెర్షన్‌లో మాత్రం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ అందుబాటులో ఉంది. వీటిలో 45W సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉండనున్నాయి. 

రియల్‌మీ పీ1 5జీ ధర (Realme P1 5G Price in India)
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో మనదేశంలో లాంచ్ అయింది. వీటిలో బేస్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. హై ఎండ్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. పీకాక్ గ్రీన్, ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌కు సంబంధించిన ఎర్లీ బర్డ్ సేల్ నేడు (ఏప్రిల్ 15వ తేదీ) సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరగనుంది. ఏప్రిల్ 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు సేల్ పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది.

రియల్‌మీ పీ1 ప్రో 5జీ ధర (Realme P1 Pro 5G Price in India)
రియల్‌మీ పీ1 ప్రో రెండు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గానూ ఉంది. ప్యారట్ బ్లూ, ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీనికి సంబంధించిన లిమిటెడ్ సేల్ ఏప్రిల్ 22వ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరగనుంది. పూర్తి స్థాయిలో సేల్ ఏప్రిల్ 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.

రియల్‌మీ పీ1 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Realme P1 5G Specifications)
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. రెయిన్ వాటర్ టచ్ ఫీచర్‌ను రియల్‌మీ పీ1లో చూడవచ్చు. అంటే తడి చేతులతో కూడా ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చన్న మాట. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌పై రియల్‌మీ పీ1 రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ను కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.

ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. మరో రెండు జనరేషన్ల ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఐపీ54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది

రియల్‌మీ పీ1 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Realme P1 Pro 5G Specifications)
రియల్‌మీ పీ1 ప్రో 5జీ ఆపరేటింగ్ సిస్టం, బ్యాటరీ, ఛార్జింగ్, సెల్ఫీ కెమెరా ఫీచర్లు రియల్‌మీ పీ1 తరహాలోనే ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 93 శాతంగానూ ఉంది. రియల్‌మీ పీ1 తరహాలోనే రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఐపీ65 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్ అందించారు.

రియల్‌మీ పీ1 ప్రో 5జీలో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 600 కెమెరాను ప్రధాన సెన్సార్‌గా అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. నైట్ ఫ్యూజన్, అల్ట్రా హెచ్‌డీఆర్, నైట్ ఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అందించారు.

Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు

టాప్ హెడ్ లైన్స్

October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget