అన్వేషించండి

Realme 9 Pro 5G Sale: రూ.16 వేలలోపే రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ - సేల్ మొదలైపోయింది - ఆండ్రాయిడ్ 12 వంటి ఫీచర్లు కూడా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ రియల్‌మీ 9 ప్రో 5జీ సేల్‌ను ప్రారంభించింది.

Realme 9 Pro 5G: రియల్‌మీ 9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. గత వారంలో ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

రియల్‌మీ 9 ప్రో 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించారు. హైఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999గా నిర్ణయించారు.

హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే దీనిపై రూ.2,000 తగ్గింపు లభించనుంది. అంటే రూ.15,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చన్న మాట. అరోరా గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

రియల్‌మీ 9 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ ప్యానెల్‌ను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే,.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.

8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా... బరువు 185 గ్రాములుగా ఉంది.

Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం

వీడియోలు

IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget