అన్వేషించండి

Poco C61: రూ.ఏడు వేలలోపే కొత్త స్మార్ట్ ఫోన్ - సూపర్ ఫీచర్లతో వచ్చిన పోకో సీ61!

Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే పోకో సీ61.

Poco C61 Launched: పోకో సీ61 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన రెడ్‌మీ ఏ3కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయినట్లు ఫీచర్లను చూస్తే తెలుస్తోంది. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై పోకో సీ61 రన్ కానుంది. ఫోన్ వెనకవైపు ఏఐ సపోర్ట్ ఉన్న 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. పోకో సీ61 బ్యాటరీ సామర్థ్యం కాగా, 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

పోకో సీ61 ధర (Poco C61 Price in India)
ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999గా నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. మార్చి 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. డైమండ్ డస్ట్ బ్లాక్, ఎథిరియల్ బ్లూ, మిస్టికల్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది.

పోకో సీ61 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Poco C61 Specifications)
పోకో సీ61లో 6.71 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ద్వారా డిస్‌ప్లేకు రక్షణ లభించనుంది. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు ఎంఎంసీ 5.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత యూజర్ ఇంటర్‌ఫేస్‌పై పోకో సీ61 రన్ కానుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు సెన్సార్లు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు మరో లెన్స్ కూడా అందించారు. ఎల్ఈడీ ఫ్లాష్‌ను కూడా వెనకవైపు చూడవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కూడా పోకో సీ61 కలిగి ఉంది.

10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. డ్యూయల్ సిమ్, 4జీ, వైఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. 3.5 ఎంఎం ఆడియో జాక్ ద్వారా ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయవచ్చు. ఫోన్ పక్కభాగంలో ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు. దీని మందం 0.83 సెంటీమీటర్లుగా ఉంది.

పోకో ఎం6 ప్రో 5జీలో కొత్త వేరియంట్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది. పోకో ఎం6 ప్రో 5జీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 6.79 అంగుళాల భారీ డిస్‌ప్లేను ఇందులో అందించారు.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Washing Machines: ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది బెటర్? మోటార్, వాటర్, స్పిన్ స్పీడ్ తేడాలు ఇవే!
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది బెటర్? మోటార్, వాటర్, స్పిన్ స్పీడ్ తేడాలు ఇవే!
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Embed widget