అన్వేషించండి

Oppo Reno 7 5G: ఒప్పో కొత్త 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయి.. మొదటిసారి ఆ కెమెరాలతో.. ధర ఎంతంటే?

ఒప్పో తన రెనో 7 సిరీస్ స్మార్ట్ ఫోన్లను మనదేశంలో ఫిబ్రవరి 4వ తేదీన లాంచ్ చేయనుంది.

ఒప్పో రెనో సిరీస్ ఫోన్లు మనదేశంలో ఫిబ్రవరి 4వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ ట్వీట్ ప్రకారం ఒప్పో రెనో 7, ఒప్పో రెనో 7 ప్రో స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ కానున్నాయి. దీనికి సంబంధించిన మైక్రో సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా కనిపించింది. అంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయన్న మాట.

ఈ స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా మనదేశంలో లీకయ్యాయి. ఒప్పో రెనో 7 5జీ ధర మనదేశంలో రూ.28 వేల నుంచి రూ.31 వేల మధ్యలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఒప్పో రెనో 7 ప్రో 5జీ ధర రూ.41,000 నుంచి రూ.43,000 మధ్యలో ఉండనుందని వార్తలు వస్తున్నాయి.

ఒప్పో రెనో 7 5జీ స్పెసిఫికేషన్లు(అంచనా)
ఒప్పో రెనో 7 5జీ చైనా వేరియంట్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 60W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 185 గ్రాములుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్709 సెన్సార్‌ను ఈ మొబైల్‌లో అందించారు.

బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, 5జీ, 4జీ వోల్టే, వైఫై 6, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, యాక్సెలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు కూడా ఇందులో అందించారు.

ఒప్పో రెనో 7 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో కూడా వెనకవైపు మూడు కెమెరాలే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌లు ఇందులో ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఒప్పో రెనో 7 ప్రో 5జీ సపోర్ట్ చేయనుంది. మిగతా ఫీచర్లన్నీ ఒప్పో రెనో 7 5జీ తరహాలోనే ఉండనున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget