అన్వేషించండి

Nothing Phone 2a Sale: అత్యంత చవకైన నథింగ్ ఫోన్ సేల్ ప్రారంభం - రూ.20 వేలలో బెస్ట్ ఫోన్!

Nothing Phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఈ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది.

Nothing Phone 2a Flipkart Sale: నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. నథింగ్ కంపెనీ స్థాపించాక లాంచ్ చేసిన మూడో ఫోన్, కంపెనీ ఇప్పటివరకు లాంచ్ చేసిన అత్యంత చవకైన ఫోన్ ఇదే. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌పై నథింగ్ ఫోన్ 2ఏ పని చేయనుంది. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించనున్నారు. ఫోన్ వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఐపీ54 రేటెడ్ బిల్డ్‌తో నథింగ్ ఫోన్ 2ఏ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ ట్రేడ్‌మార్క్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ తరహా గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను ఇందులో కూడా చూడవచ్చు.

నథింగ్ ఫోన్ 2ఏ ధర, ఆఫర్లు (Nothing Phone 2a Price in India)
ఈ స్మార్ట్ ఫోన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.27,999గా నిర్ణయించారు. వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ ఇప్పటికే ప్రారంభం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా నథింగ్ ఫోన్ 2ఏ కొనుగోలు చేస్తే రూ.2,000 క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. ఎక్స్‌ఛేంజ్‌పై రూ.2,000 అదనపు తగ్గింపు అందించనున్నారు. అంటే రూ.నాలుగు వేల వరకు తగ్గింపు లభించనుందన్న మాట. తొమ్మిది నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందించారు.

నథింగ్ ఫోన్ 2ఏ స్పెసిఫికేషన్లు (Nothing Phone 2a Features)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. మూడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లు అందిస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 30 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ మధ్య ఉండనుంది. 256 జీబీ వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, వైఫై 6 డైరెక్ట్, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, 360 డిగ్రీ యాంటెన్నా, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ కూడా ఉన్నాయి. 

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా డిస్‌ప్లేకు ప్రొటెక్షన్ లభించనుంది. హెచ్‌డీఆర్10+ సపోర్ట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆక్టాకోర్ 4 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌పై నథింగ్ ఫోన్ 2ఏ రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్‌ను కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. హైడెఫినిషయన్ మైక్రోఫోన్లు, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒక 50 మెగాపిక్సెల్ సెన్సార్ ప్రధాన కెమెరా కాగా, మరో 50 మెగాపిక్సెల్ సెన్సార్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను మెయిన్ సెన్సార్ సపోర్ట్ చేయనుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 114 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూను డెలివర్ చేయనుందని కంపెనీ తెలిపింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

నథింగ్ ఫోన్ 2ఏలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ స్మార్ట్ ఫోన్ అందించనుందని కంపెనీ తెలిపింది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా 59 నిమిషాల్లోనే నథింగ్ ఫోన్ 2ఏ పూర్తిగా ఛార్జ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది. ఇంతకు ముందు రెండు ఫోన్ల తరహాలోనే ట్రాన్స్‌పరెంట్ గ్లిఫ్ డిజైన్‌తో నథింగ్ ఫోన్ 2ఏ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget