అన్వేషించండి

Netflix Profile Transfer: అందుబాటులోకి నెట్ ఫ్లిక్స్ ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ ఫీచర్, ఇక పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్!

స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను భారత్ లో అందుబాటులోకి తెచ్చింది.

ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిరోధించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. తాజాగా ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను భారతీయ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. కొన్ని వారాల కిందటే ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ ను అందుబాటులోకి తేబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. తాజాగా ఈ ఫీచర్ ను పరిచయం చేసింది. నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు ప్రొఫైల్ బదిలీ గురించి ఇమెయిల్‌ల ద్వారా తెలియజేయడం ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్ ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ అవకాశం అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్ ప్రకారం యూజర్ కు సంబంధించిన  వ్యూయింగ్ హిస్టరీతో పాటు సిఫార్సులు, మైలిస్ట్, సేవ్ చేసిన గేమ్స్ సహా పలు అంశాలను ఇతర అకౌంట్స్ కు బదిలీ చేసే అవకాశం ఉంది.

ఏ అంశాలను బదిలీ చేసుకోవచ్చంటే?

"ప్రజలు ముందుగుసాగుతారు.  కుటుంబాలు పెరుగుతాయి. సంబంధాలు ముగుస్తాయి. కానీ ఈ జీవిత మార్పులన్నిటికీ, మీ Netflix అనుభవం ఒకేలా ఉండాలి.  ఈరోజు, మేము ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ అవకాశాన్ని  ప్రారంభిస్తున్నాం. ఇది మీ అకౌంట్ ను ఉపయోగించే వ్యక్తులను ప్రొఫైల్‌ను ట్రాన్స్ ఫర్ చేయడానికి అనుమతించే ఒక ఫీచర్. వ్యక్తిగతీకరించిన సిఫార్సులను అలాగే ఉంచడం, వ్యూయింగ్ హిస్టరీ, మై లిస్ట్, సేవ్ చేసిన గేమ్‌లు, ఇతర సెట్టింగ్‌లు ఇతరులను వినియోగించుకునే అవకాశం ఉంది” అని నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది.  ఈ ఫీచర్‌ను ప్రకటించినప్పుడు, వినియోగదారు ఖాతాలో ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఇమెయిల్ ద్వారా తెలియజేయబడుతుందని నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే తెలిపింది.

పేమెంట్స్ విషయంలో ఆ అవకాశం లేదు

నెట్‌ ఫ్లిక్స్ వినియోగదారులు తమ ఖాతాలను బదిలీ చేయాలనుకునే వెబ్‌ లో, మీ ప్రొఫైల్‌ కు యాక్సెస్ ఉన్న అకౌంట్ కు సైన్ ఇన్ చేయడం ద్వారా మొదలు పెట్టవచ్చు.  వినియోగదారులు వారి నెట్‌ ఫ్లిక్స్ అకౌంట్ పేజీని కూడా చూసే అవకాశం ఉంటుంది. లేదంటే వారి హోమ్‌పేజీలో డ్రాప్ డౌన్‌లో ఈ ఎంపికను చూసే వెసులుబాటు ఉంటుంది. అయితే, Netflix ప్రొఫైల్ బదిలీలో భాగంగా చెల్లింపు సమాచారం కొత్త అకౌంట్ కు  బదిలీ చేయబడదు. అలాగే, పిల్లల ప్రొఫైల్‌లు మరియు PIN- ప్రొటెక్టెడ్ ప్రొఫైల్‌లు కూడా బదిలీ చేయబడవు.

నవంబర్ 3 నుంచి 'బేసిక్ విత్ యాడ్స్' స్ట్రీమింగ్ ప్లాన్‌

నవంబర్ 3 నుంచి మరోవైపు  వినియోగదారుల కోసం యాడ్ సపోర్ట్ టైర్‌ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నెట్ ఫ్లిక్స్, నవంబర్ 3 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తేబోతుంది. పలు  దేశాలలో 'బేసిక్ విత్ యాడ్స్' స్ట్రీమింగ్ ప్లాన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. "ప్లాన్ ప్రకటనదారులకు ఒక ఎగ్జైటింగ్ ఆపర్చునిటీని అందజేయబోతున్నాం. ఎలాంటి అవాంతరాలు లేని , హెచ్ డీ ప్రకటనల అనుభవంతో స్ట్రీమింగ్ ఉంటుంది.  టీవీని ఎక్కువగా చూడని యువ వీక్షకులతో సహా విభిన్న ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉంటుంది” అని నెట్ ఫ్లిక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ అయిన  గ్రెగ్ పీటర్స్ వెల్లడించారు.

Read Also: ట్విట్టర్ నుంచి బయటకు వెళ్తూ, పరాగ్ అగర్వాల్ ఎంత డబ్బు తీసుకెళ్తారో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
Washing Machines: ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది బెటర్? మోటార్, వాటర్, స్పిన్ స్పీడ్ తేడాలు ఇవే!
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది బెటర్? మోటార్, వాటర్, స్పిన్ స్పీడ్ తేడాలు ఇవే!
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget