అన్వేషించండి

Motorola Edge 30 Pro: 50 + 50, 60 మెగాపిక్సెల్ సెన్సార్లతో మోటొరోలా ఫోన్ లాంచ్ - ఇది మామూలు కెమెరా ఫోన్ కాదుగా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా మనదేశంలో తన ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని ధరను రూ.49,999గా నిర్ణయించారు.

మోటొరోలా ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన మోటొరోలా ఎడ్జ్ 20 ప్రో స్మార్ట్ ఫోన్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. మోటొరోలా ఎడ్జ్ 30 ప్రోలో 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఇందులో 68W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అసుస్ రోగ్ ఫోన్ 5ఎస్, వివో ఎక్స్70 ప్రో, ఐకూ 9 సిరీస్‌తో ఈ ఫోన్ పోటీ పడనుంది.

మోటొరోలా ఎడ్జ్ 30 ప్రో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.49,999గా నిర్ణయించారు. కాస్మోస్ బ్లూ, స్టార్ డస్ట్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన సేల్ మార్చి 4వ తేదీ నుంచి జరగనుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ ఆఫర్ కింద ఈ ఫోన్‌పై రూ.ఐదు వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందించారు. రిటైల్ స్టోర్లలో కూడా ఈ తగ్గింపు అందుబాటులో ఉండనుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా కొంటే ఈ ఆఫర్ లభించనుంది. దీంతోపాటు జియో వినియోగదారులకు రూ.10 వేల విలువైన లాభాలు అందించనున్నారు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా దీనిపై అందించారు.

మోటొరోలా ఎడ్జ్ 30 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై మోటొరోలా ఎడ్జ్ 30 ప్రో పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, డీసీఐ పీ3 కలర్ స్పేస్ కూడా ఇందులో ఉన్నాయి. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌‌ను ఇందులో అందించారు.

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉంది. 68W టర్బోపవర్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. కేవలం 15 నిమిషాల్లోనే ఈ ఫోన్ 0 నుంచి 50 శాతం చార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ పేర్కొంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 60 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో అందించారు. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 196 గ్రాములుగా ఉంది.

Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

టాప్ హెడ్ లైన్స్

Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget