అన్వేషించండి

Moto G04 Sale: రూ.10 వేలలో బెస్ట్ ఫోన్ - సేల్ నేటి నుంచే - 16 వేలలోపే 8 జీబీ ర్యామ్!

Moto G04: మోటో జీ04 సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది.

Moto G04 Flipkart Sale: మోటో జీ04 స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. దీనికి సంబంధించిన సేల్‌ను కూడా కంపెనీ ప్రారంభించింది. ఇందులో యూనిసోక్ ప్రాసెసర్‌ను మోటొరోలా అందించింది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ర్యామ్‌ను ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా మరో 8 జీబీ పెంచుకునే అవకాశం ఉంది. అంటే ఏకంగా 16 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుందన్న మాట.

మోటో జీ04 ధర (Moto G04 Price in India)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ.6,999గా ఉండగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా నిర్ణయించారు. జియో రూ.399 ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.2,000 విలువైన క్యాష్ బ్యాక్ వోచర్లు, రూ.2,500 విలువైన పార్ట్‌నర్ కూపన్లను కంపెనీ అందించనుంది. దీనికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్, మోటొరోలా అధికారిక వెబ్ సైట్, రిటైల్ స్టోర్లలో ప్రారంభం అయింది.

మోటో జీ04 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Moto G04 Specifications, Features)
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై మోటో జీ04 పని చేయనుంది. ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. మోటో జీ04 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. పంచ్ హోల్‌ను సరిగ్గా మధ్యలో చూడవచ్చు. యూనిసోక్ టీ606 ప్రాసెసర్ ద్వారా మోటో జీ04 రన్ అవుతుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని మోటో జీ04లో అందించారు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఈ ఫోన్ 102 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్, 22 గంటల టాక్ టైమ్‌ను అందించనుందని కంపెనీ తెలిపింది. డాల్బీ అట్మాస్ ఫీచర్‌ను సపోర్ట్‌ చేసే స్పీకర్లు కూడా ఉండటం విశేషం. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 179 గ్రాములుగా ఉంది.

మరోవైపు వివో వీ30 ప్రో స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ రాబోయే కొన్ని వారాల్లో మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుందని తెలిపింది. వివో వీ30 స్మార్ట్ ఫోన్ కొన్ని మార్కెట్లలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌లో 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే అందించనున్నట్లు తెలుస్తోంది. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుందని కంపెనీ తెలిపింది.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget