ICC Awards: 2021లో అత్యుత్తమ టీ20 క్రికెటర్ అవార్డు ఇతనికే.. ఎన్నో మ్యాచ్‌విన్నింగ్ ఇన్సింగ్స్!
పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌కు ఐసీసీ మెన్స్ టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు దక్కింది. మహిళల్లో ఉత్తమ టీ20 క్రికెటర్‌గా ఇంగ్లండ్‌కు చెందిన టామీ బ్యూమెంట్ నిలిచింది.

పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 2021 సంవత్సరానికి ఐసీసీ మెన్స్ టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. గత సంవత్సరం రిజ్వాన్ బీభత్సమైన ఫాంతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. మిషెల్ మార్ష్, జోస్ బట్లర్, వనిందు హసరంగలను సైతం వెనక్కి నెట్టి రిజ్వాన్ ఈ అవార్డును గెలుచుకున్నాడు.
2021లో 29 మ్యాచ్‌ల్లోనే రిజ్వాన్ 1,326 పరుగులను సాధించాడు. తన బ్యాటింగ్ సగటు 73.66 కాగా, స్ట్రైక్ రేట్ ఏకంగా 134.89గా ఉంది. దీంతోపాటు వికెట్ల వెనుక కూడా మహ్మద్ రిజ్వాన్ కీలక పాత్ర పోషించాడు. 2021 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మహ్మద్ రిజ్వాన్ మూడో స్థానంలో నిలిచాడు.
ఈ సంవత్సరమే తన మొదటి టీ20 శతకాన్ని కూడా మహ్మద్ రిజ్వాన్ అందుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లోనే రిజ్వాన్ 79 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ సంవత్సరం మహ్మద్ రిజ్వాన్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇదేనని చెప్పవచ్చు.
రిజ్వాన్‌కు గట్టిపోటీని ఇచ్చిన మిషెల్ మార్ష్ కూడా ఈ సంవత్సరం మంచి ప్రదర్శనను కనపరిచాడు. ఆస్ట్రేలియా ఈ సంవత్సరం టీ20 ప్రపంచకప్ గెలవడంతో కీలకపాత్ర పోషించాడు. మార్ష్‌తో పాటు డేవిడ్ వార్నర్ కూడా విజృంభించడంతో ఆస్ట్రేలియా తన మొదటి టీ20 వరల్డ్ కప్‌ను సాధించింది.
మహిళల్లో ఉత్తమ టీ20 క్రికెటర్ అవార్డు ఎవరికంటే?
ఇక ఇంగ్లండ్ క్రికెటర్ టామీ బ్యూమెంట్‌కు ఐసీసీ టీ20 ఉమెర్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక స్కోరు తనదే. ప్రపంచం మొత్తంగా మీద మూడో స్థానంలో నిలిచింది. ఎన్నో మ్యాచ్‌ల్లో కీలక సమయాల్లో జట్టును ఆదుకుంది.
Sheer Consistency, indomitable spirit and some breathtaking knocks 🔥
— ICC (@ICC) January 23, 2022
2021 was memorable for Mohammad Rizwan 👊
More 👉 https://t.co/9guq9xKOod pic.twitter.com/6VZo7aaRIA
Also Read: ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?
Also Read: Virat Kohli Record: సాహో.. కోహ్లీ! ఇక ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పట్లో సాధ్యం కానట్టే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

