అన్వేషించండి

Google Pixel: గూగుల్ మొబైల్స్ ఎందుకు ఇండియాలో సక్సెస్ కాలేదు - కారణాలు ఇవే!

గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో ఎందుకు సక్సెస్ కాలేదు? మార్కెట్‌ విషయంలో ఎందుకు విఫలం అయ్యాయి?

Google Pixel Smartphone: గూగుల్... ఈ పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది సెర్చింజనే. అన్ని స్మార్ట్ ఫోన్లలో గూగుల్ సెర్చింజన్ కంపల్సరీ అయిపోయింది. సెర్చింజన్‌గా గూగుల్ సక్సెస్ స్టోరీ అలాంటిది. కానీ తనే స్వయంగా ఒక స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌ను తీసుకువచ్చినా గూగుల్ సక్సెస్ కాలేకపోయింది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయడం కాదు కదా... ఆ మొబైల్ వాడేవారిని చూడటం కూడా అరుదే. మరి గూగుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తన ముద్ర ఎందుకు వేయలేకపోయింది?

పేరు వినపడకపోవడమే ప్రాబ్లమా?
గూగుల్ పిక్సెల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను అస్సలు విడుదల చేయలేదు. కంపెనీ లాంచ్ చేసినవన్నీ ప్రీమియం, మిడ్ రేంజ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లు తప్ప మనదేశంలో ఎక్కువ మంది కొనుగోలు చేసే రూ.20 వేల లోపు సెగ్మెంట్‌లో గూగుల్ పిక్సెల్ ఒక్క ఫోన్ కూడా లాంచ్ చేయలేదు. బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేయడం ద్వారా చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ, రియల్‌మీ, ఐకూ, వివో, ఒప్పో వంటి స్మార్ట్ ఫోన్ కంపెనీలు టైర్-2, టైర్-3 నగరాల్లోకి కూడా చొచ్చుకుపోయాయి. ఐటెల్, ఇన్‌ఫీనిక్స్ లాంటి కంపెనీలు కూడా బడ్జెట్ ఫోన్లతో తమకంటూ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాయి.

మరోవైపు ప్రీమియం విభాగంలో కూడా యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ వంటి బ్రాండ్లు దూసుకుపోతున్నాయి. యాపిల్‌కు బ్రాండ్ వాల్యూ అనేది చాలా పెద్ద ప్లస్. ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ బ్రాండ్లలో వన్‌ప్లస్ మొదట కొన్నాళ్లు ఏకఛత్రాధిపత్యం చూపించింది. అయితే ఆక్సిజన్ఓఎస్‌కు చేసిన మార్పులు ఫెయిల్ అవ్వడంతో వన్‌ప్లస్ క్రమంగా తన మార్కెట్ వాల్యూను కోల్పోయింది. కానీ గూగుల్ పేరు మాత్రం ఎప్పుడూ ఈ సెగ్మెంట్లో వినిపించలేదు.

దానికి అనేక కారణాలు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ ఫోన్‌లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే... కెమెరా, ప్యూర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం (బ్లోట్ వేర్ లేకుండా) తప్ప మరో మాట కూడా వినిపించదు. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లు ‘వాల్యూ ఫర్ మనీ’ కాదు అనే ముద్ర బలంగా పడిపోయింది. టెక్నాలజీ మీద విపరీతమైన ఆసక్తి ఉన్నవారు, ఒక్కసారికి కొత్తగా ప్రయత్నిద్దాం అనుకునే వారు తప్ప ఎక్కువ మంది యూజర్లు గూగుల్ పిక్సెల్‌ను ఎక్కువగా పట్టించుకోలేదు.

సెర్చింజన్‌గా ఓకే... మరి స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌గా...
గూగుల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్. ఎవరికి ఏ సమాచారం కావాలన్నా అందులో దొరుకుతుంది. ఆ బ్రాండ్ వాల్యూ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కంపెనీకి ఏ మాత్రం ఉపయోగపడలేదు. గూగుల్ కూడా భారత్‌ను పెద్ద మార్కెట్‌గా తీసుకున్నట్లు కనిపించలేదు. భారతదేశంలో గూగుల్ పిక్సెల్ చేసుకున్న ప్రచారం కూడా అంతంత మాత్రమే. భారతదేశంలో ఈ ఫోన్ల అందుబాటు కూడా అంతంత మాత్రమే. స్టోర్లలో కూడా ఎక్కువగా విక్రయించదు. ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా కొనుగోలు చేయవచ్చు.

సర్వీస్ సెంటర్లూ అంతంత మాత్రమే...
గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ అంతంత  మాత్రంగానే ఉండటానికి మరో కారణం సర్వీస్ సెంటర్ల కొరత. దేశం మొత్తం మీద గూగుల్ పిక్సెల్‌కు ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లు గట్టిగా 30 కూడా ఉండవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు సర్వీస్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ పట్నంల్లో ఈ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఫోన్‌లో ఏదైనా చిన్న సమస్య తలెత్తినా అందుబాటులో సర్వీస్ సెంటర్ లేకపోతే ఒక్కసారి ఫోన్ కొన్న యూజర్ మరోసారి ఫోన్ కొనడానికి ఇష్టపడడు. కాబట్టి ఈ విషయాల్లో మెరుగుపడకపోతే గూగుల్ ఎప్పటికీ భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను క్రాక్ చేయలేదు.

Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget