అన్వేషించండి

iPhone 16 Pro Max కొనడానికి డౌన్ పేమెంట్ ఎంత ? EMI ఎంత అవుతుంది?

iPhone 16 Pro Max EMI: ఐఫోన్ 16 ప్రో మాక్స్ కొనడం ఇక కష్టం కాదు. ప్రీమియం ధర ఉన్నప్పటికీ చాలా ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఈజీగా కొనుక్కోవచ్చు.

iPhone 16 Pro Max EMI :  Apple iPhone కొనాలనే కల చంపుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఈజీగా కొనుక్కోవచ్చు. iPhone 16 Pro Max ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఖరీదు కచ్చితంగా ప్రీమియం కేటగిరీలో ఉంది. కానీ కొనడం మాత్రం కష్టం కాదు. ఈ ఫోన్ కోససం చాలా ఫైనాన్స్ కంపెనీలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల EMI సౌకర్యాలు కల్పిస్తున్నాయి.  భారీగా డబ్బులు చెల్లించకుండానే తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే ఖరీదైన ఐఫోన్ మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుక్కోవడానికి ఎంత డౌన్‌పేమెంట్ చెల్లించాలి? దాని నెలవారీ వాయిదా (EMI) ఎంత అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం. 

ధర ఎంత?

ముందు iPhone 16 Pro Max ధర గురించి మాట్లాడుకుందాం. iPhone 16 Pro Max ప్రారంభమైన తర్వాత భారత్‌లో దీని ధర దాదాపు 1,29,900గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది కేవలం బేస్ వేరియంట్ మాత్రమే. మెమొరీ పెరిగే కొద్దీ ధర కూడా మారుతూ ఉంటుంది. ధర ఎంత ఉన్నప్పటికీ సాధారణ వినియోగదారులు కూడా కొనక్కునే వెసులుబాటు ఫైనాన్స్‌ సంస్థలు కల్పిస్తున్నాయి. వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు EMI సౌకర్యం ద్వారా కొనుక్కోవచ్చు.  

మీరు ఈ ఫోన్‌ను EMIలో కొనాలనుకుంటే, మీకు అనేక ఆప్షన్‌లు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు,  ఫైనాన్స్ కంపెనీలు జీరో  డౌన్‌పేమెంట్, నో-కాస్ట్ EMI ఎంపికను కూడా అందిస్తున్నాయి. అంటే, మీరు ఎటువంటి ముందస్తు చెల్లింపు చేయకుండానే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు . ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించడం ద్వారా అప్పు తీర్చేయొచ్చు. ఉదాహరణకు, మీరు 1,29,900 ధర కలిగిన iPhone 16 Pro Maxని 12 నెలల పాటు నో-కాస్ట్ EMIలో తీసుకుంటే మీరు నెలకు దాదాపు ₹10,800 నుంచి ₹11,000 మధ్య EMI చెల్లించాలి.

EMI ఎంత అవుతుంది?

మీరు కొంచెం డౌన్‌పేమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటే, మీ EMI మరింత తగ్గుతుంది. మీరు మొత్తం ధరలో 20 శాతం, అంటే దాదాపు ₹26,000 డౌన్‌పేమెంట్ చేస్తే, మిగిలిన ₹1,03,000పై మీ EMI తగ్గుతుంది. ఈ సందర్భంలో, 12 నెలల EMI దాదాపు ₹8,500 నుంచి ₹9,000 వరకు ఉంటుంది. అదేవిధంగా, మీరు 33% అంటే దాదాపు ₹43,000 వరకు డౌన్‌పేమెంట్ చేస్తే, EMI మరింత తగ్గి ₹6,500 నుంచి ₹7,000 మధ్యకి రావచ్చు, ముఖ్యంగా మీరు 16 నెలల ప్లాన్‌ను ఎంచుకుంటే ఇంత చెల్లించాల్సి ఉంటుంది.

ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఆఫర్‌లు  

వీటికి Flipkart , Amazon వంటి కొన్ని ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు ప్రత్యేక ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లను కూడా అందిస్తాయి. ఇది మీ మొత్తం ఖర్చును తగ్గిస్తుంది. అలాగే, HDFC, ICICI, Axis వంటి అనేక బ్యాంకులు క్యాష్‌బ్యాక్ లేదా తక్షణ డిస్కౌంట్‌లను అందిస్తాయి, ఇది EMIపై ప్రభావం చూపుతుంది.

మొత్తంమీద, iPhone 16 Pro Max కొనడం ఇప్పుడు ధనవంతులకే పరిమితం కాలేదు. EMI పథకాలు డౌన్‌పేమెంట్ ఎంపికలు మధ్యతరగతి వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చాయి. సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా, కొంచెం తెలివిగా ఉండటం ద్వారా, ఈ ఖరీదైన ఫోన్‌ను కూడా మీ ఆర్థిక పరిస్థితిపై అదనపు భారం లేకుండా సులభమైన నెలవారీ వాయిదాలలో కొనుగోలు చేయవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Embed widget