News
News
X

50 మెగాపిక్సెల్ కెమెరాతో వివో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ చేసింది. అదే వివో వై35.

FOLLOW US: 

వివో వై-సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయింది. అదే వివో వై35. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది.

వివో వై35 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 33,99,000 ఇండోనేషియా రూపాయలుగా (సుమారు రూ.18,500) ఉంది. గోల్డ్, బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

వివో వై35 స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 × 2408 పిక్సెల్స్‌గా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఎన్టీఎస్సీ కలర్ గాముట్ కూడా ఇది సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ బొకే సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. డ్యూయల్ సిమ్, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, బైదు, గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 188 గ్రాములుగా ఉంది.

వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై వివో వీ25 ప్రో పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్ కూడా ఉంది. 5జీ సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. 6.56 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది. వెనకవైపు మూడు కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999 కాగా,  12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ప్యూర్ బ్లాక్, సెయిలింగ్ బ్లూ రంగుల్లో వివో వీ25 ప్రో లాంచ్ అయింది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3,500 అదనపు తగ్గింపు లభించనుంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 19 Aug 2022 12:40 AM (IST) Tags: Vivo Y35 Price Vivo Y35 Vivo Y35 Specifications Vivo Y35 Features Vivo Y35 Launched

సంబంధిత కథనాలు

Itel Vision 3 Turbo: రూ.8 వేలలోపే ఐటెల్ కొత్త ఫోన్ - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ కూడా!

Itel Vision 3 Turbo: రూ.8 వేలలోపే ఐటెల్ కొత్త ఫోన్ - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ కూడా!

వన్‌ప్లస్ కొత్త ఫోన్ వచ్చేసింది - 10ఆర్‌లోనే అదిరిపోయే కొత్త మోడల్!

వన్‌ప్లస్ కొత్త ఫోన్ వచ్చేసింది - 10ఆర్‌లోనే అదిరిపోయే కొత్త మోడల్!

Google Pixel 7 Pro Price: గూగుల్ కొత్త ఫోన్ల ధర లీక్ - ఈసారి ధర భారీగానే!

Google Pixel 7 Pro Price: గూగుల్ కొత్త ఫోన్ల ధర లీక్ - ఈసారి ధర భారీగానే!

Realme Narzo 50i Prime Sale: రియల్‌మీ కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - అమెజాన్‌లో కొనేయచ్చు!

Realme Narzo 50i Prime Sale: రియల్‌మీ కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - అమెజాన్‌లో కొనేయచ్చు!

Tecno Pova Neo 5G: రూ.16 వేలలోపే టెక్నో 5జీ ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Tecno Pova Neo 5G: రూ.16 వేలలోపే టెక్నో 5జీ ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

టాప్ స్టోరీస్

KTR News: న్యూ జెర్సీలో బుల్డోజర్, దానిపై వాళ్లిద్దరి ఫోటోలు - అంతర్జాతీయంగా పరువు పోయిందన్న కేటీఆర్

KTR News: న్యూ జెర్సీలో బుల్డోజర్, దానిపై వాళ్లిద్దరి ఫోటోలు - అంతర్జాతీయంగా పరువు పోయిందన్న కేటీఆర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!