అన్వేషించండి

Tecno Pova Neo 5G: 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ - ధర రూ.17 వేలలోనే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో కొత్త ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. అదే టెక్నో పోవా నియో 5జీ.

టెక్నో పోవా నియో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. దీని ధర, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైవోఎస్ యూఐ, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ఈ ఫోన్ ధరను ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉండనున్నాయి. వాల్యూమ్ రాకర్లు, పవర్ బటన్ ఫోన్‌కు కుడివైపున ఉండనున్నాయి.

టెక్నో పోవా నియో 5జీ ధర (అంచనా)
టెక్నో పోవా నియో 5జీ ధర రూ.17 వేల నుంచి రూ.19 వేల మధ్యలో ఉండనుంది. సాఫైర్ బ్లాక్, స్ప్రింట్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. టెక్నో పోవా నియో 5జీ మనదేశంలో కూడా త్వరలో లాంచ్ కానుంది.

టెక్నో పోవా నియో 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)
6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని వార్తలు వచ్చాయి. ఇందులో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండనుంది. 6.9 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే కూడా టెక్నో పోవా నియో 5జీలో అందించనున్నారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ యూఐ ఆఫరేటింగ్ సిస్టంపై మొబైల్ పనిచేయనుంది.

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉండనుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

టెక్నో పాప్ 6 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను బంగ్లాదేశ్‌లో 10,490 టాకాలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.8,900) నిర్ణయించారు. ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుంది. దీని భారతీయ వేరియంట్ ధర రూ.9 వేలలోపే ఉండే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై టెక్నో పాప్ 6 ప్రో రన్ అవ్వనుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Digital Legacy: మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
మీరు చనిపోయాక WhatsApp, Gmail డేటా ఏమవుతుంది? అవి ఫ్యామిలీ యాక్సెస్ చేయవచ్చా..
Track Switched Off Phone : స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం
స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ ఫోన్ లైవ్ లొకేషన్‌ ఇలా తెలుసుకోండి.. యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget