అన్వేషించండి

Samsung Galaxy M13 Sale: శాంసంగ్ కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - రూ.10 వేలలోపే సూపర్ ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కొత్త ఫోన్ గెలాక్సీ ఎం13 సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.

శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్ ఫోన్ సేల్ అమెజాన్‌లో. ఇందులో సరికొత్త ఆటో డేటా స్విచ్చింగ్ టెక్నాలజీ అందించారు. మొదటి సిమ్‌లో నెట్‌వర్క్ లేకపోతే రెండో సిమ్ సిగ్నల్ ద్వారా మొదటి సిమ్ నుంచి కాల్స్ రిసీవ్ చేసుకునే ఆప్షన్ ఉందన్న మాట. అంటే మీ ఫోన్‌లో ఒక సిమ్‌కు సిగ్నల్ లేకపోయినా రెండో సిమ్ నెట్‌వర్క్‌తో కాల్స్ చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎం13 ధర
ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర  రూ.11,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఆక్వా గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ, స్టార్‌డస్ట్ బ్రౌన్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు లభించనుంది. అంటే రూ.10 వేలలోపే కొనేయచ్చన్న మాట.

శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ ఎం13 పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 480 నిట్స్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించారు. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా 12 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు.

128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చన్న మాట. శాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎం13 పని చేయనుంది. దీని మందం 0.93 సెంటీమీటర్లు కాగా, బరువు 207 గ్రాములుగా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వైఫై, 4జీ ఎల్టీఈ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ సూట్ కూడా ఈ ఫోన్‌తో పాటు రానుంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Actor Sathyendra Death: 60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Embed widget