అన్వేషించండి

Samsung Galaxy A04s: శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది - రూ.12 వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్.

శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ04కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. యూరోపియన్ వెబ్ సైట్లో ఈ ఫోన్ లిస్ట్ అయింది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ధర
ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. శాంసంగ్ ఫిన్‌ల్యాండ్ వెబ్ సైట్లో ఈ ఫోన్ లిస్ట్ అయింది. బ్లాక్, కాపర్, గ్రీన్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ03ఎస్ స్మార్ట్ ఫోన్ ధర మనదేశంలో రూ.11,499గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ కోర్ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. అయితే దీని పేరు మాత్రం తెలపలేదు. ఎక్సినోస్ 850 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్/ఏ-జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 195 గ్రాములుగా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ04 స్మార్ట్ ఫోన్ కూడా ఇటీవలే సైలెంట్‌గా మార్కెట్లో లాంచ్ అయింది. దీని ధరను కూడా కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఈ ఫోన్ అమెరికాలో మాత్రమే కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియలేదు.

ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని ప్రాసెసర్ వివరాలను ఇంకా రివీల్ చేయలేదు. కానీ ఎక్సినోస్ 850 అయ్యే అవకాశం ఉంది. 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు, 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో గెలాక్సీ ఏ04 లాంచ్ అయింది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

టాప్ హెడ్ లైన్స్

SIM No Service Problem: మీ ఫోన్‌
మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!
iPhone Voice Control: 'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
'సిరి'తో పనిలేదు.. మీ వాయిస్‌తో ఐఫోన్‌ కంట్రోల్.. ఎలా పనిచేస్తుదంటే?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Apple iPhone 18 Pro Sales EMI: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Bowling Coach Reunion: చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Embed widget