అన్వేషించండి

Redmi Note 11SE Sale: రెడ్‌మీ కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - రూ.14 వేలలోపే నాలుగు కెమెరాల ఫోన్!

రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

షావోమీ మనదేశంలో ఇటీవలే లాంచ్ చేసిన రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది. ఇందులో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.

రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరంది రూ.13,499గా నిర్ణయించారు. బైఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, స్పేస్ బ్లాక్, థండర్ పర్పుల్ రంగుల్లో రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ అందబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ స్పెసిఫికేషన్లు

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ పని చేయనుంది. ఇందులో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌‌ను ఈ ఫోన్ పనిచేయడానికి . 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

డ్యూయల్ స్పీకర్ సెటప్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ రెడ్‌మీ నోట్ 11ఎస్ఈలో ఉన్నాయి. ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. రెడ్‌మీ నోట్ 11ఎస్ఈత మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 178.8 గ్రాములుగా ఉంది.

రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ అనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. చార్‌కోల్ బ్లాక్, స్లేట్ గ్రే, సీ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 

ఇందులో 6.53 అంగుళాల వాటర్ డ్రాప్ నాచ్ తరహా హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

OpenAI సంచలనం.. ఏ యాప్స్ అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ - అది ఎలా పనిచేస్తుందంటే..!
OpenAI సంచలనం.. ఏ యాప్స్ అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ - అది ఎలా పనిచేస్తుందంటే..!
Smart Phone Care Tips: హాట్ సమ్మర్‌లో మీ మొబైల్ కూల్‌గా ఉంచుకోవడానికి పాటించాల్సిన చిట్కాలు ఇవే!
హాట్ సమ్మర్‌లో మీ మొబైల్ కూల్‌గా ఉంచుకోవడానికి పాటించాల్సిన చిట్కాలు ఇవే!
మీ iPhone అసలైనదా లేక నకిలీదా? IMEI నంబర్ సహా ఈ పద్ధతుల్లో గుర్తించండి
మీ iPhone అసలైనదా లేక నకిలీదా? IMEI నంబర్ సహా ఈ పద్ధతుల్లో గుర్తించండి
Internet Data Tax: ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!
ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!

వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Virat Kohli 9000 Runs in IPL | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ విశ్వరూపం
DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ
Mitchell Santner Ruled Out IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder Booking Rules: మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్‌ రూల్స్‌లో మార్పులు! వీళ్లకు సిలిండర్స్ కట్!
మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్‌ రూల్స్‌లో మార్పులు! వీళ్లకు సిలిండర్స్ కట్!
Amaravati Latest News:ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్రం! అమరావతి పనులకు డీజిల్ సరఫరాకు రెడ్‌ సిగ్నల్ !
ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్రం! అమరావతి పనులకు డీజిల్ సరఫరాకు రెడ్‌ సిగ్నల్ !
KCR Students Plan: విద్యార్థులతోనే బీఆర్ఎస్ పునర్‌నిర్మాణం - కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
విద్యార్థులతోనే బీఆర్ఎస్ పునర్‌నిర్మాణం - కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Bengal election polling: బెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌‌కకు సర్వం సిద్ధం - మోదీ వర్సెస్ దీదీ - ఎవరిది పైచేయి?
బెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌‌కకు సర్వం సిద్ధం - మోదీ వర్సెస్ దీదీ - ఎవరిది పైచేయి?
TN 2026 OTT: నాలుగు ఓటీటీల్లోకి టీఎన్ 2026... విజయ్‌ను టార్గెట్ చేశారనుకున్నా... కలెక్షన్స్ నిల్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నాలుగు ఓటీటీల్లోకి టీఎన్ 2026... విజయ్‌ను టార్గెట్ చేశారనుకున్నా... కలెక్షన్స్ నిల్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Petrol and diesel shortage: రేట్లు పెంచే ముందు వ్యూహాత్మకంగానే పెట్రోల్, డీజిల్ కొరత - ఆయిల్ కంపెనీల ప్లాన్ అదేనా?
రేట్లు పెంచే ముందు వ్యూహాత్మకంగానే పెట్రోల్, డీజిల్ కొరత - ఆయిల్ కంపెనీల ప్లాన్ అదేనా?
Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణాం.. రోహిత్‌ రెడ్డికి హైకోర్టు హైకోర్టు బెయిల్
మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణాం.. రోహిత్‌ రెడ్డికి హైకోర్టు హైకోర్టు బెయిల్
Festivals in May 2026 : హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
Embed widget