అన్వేషించండి

Realme GT 5: ప్రపంచంలో ఈ ఫీచర్ ఉన్న మూడో ఫోన్ ఇదే - రియల్‌మీ జీటీ 5ని లాంచ్ చేసిన కంపెనీ!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ అయిన రియల్‌మీ జీటీ 5ని మార్కెట్లో లాంచ్ చేసింది.

రియల్‌మీ జీటీ 5 స్మార్ట్ ఫోన్ చైనాలో సోమవారం లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. 24 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం రెండు ఫోన్లు మాత్రమే 24 జీబీ ర్యామ్‌తో లాంచ్ అయ్యాయి. రియల్‌మీ జీటీ 5 ఈ జాబితాలో మూడో ఫోన్. వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో, నుబియా రెడ్ మ్యాజిక్ 8ఎస్ ప్రో ప్లస్ మొబైల్స్ మొదటి రెండు ఫోన్లు. 240W ఫాస్ట్ ఛార్జింగ్‌ను 24 జీబీ ర్యామ్ వేరియంట్ సపోర్ట్ చేయనుంది.

 రియల్‌మీ జీటీ 5 ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ వేరియంట్ ధరను 2,999 యువాన్లుగా (సుమారు రూ.34,400) నిర్ణయించారు. ఇక 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,299 యువాన్లుగా (సుమారు రూ.37,800) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 24 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ కొనాలంటే 3,799 యువాన్లుగా (సుమారు రూ.43,600) నిర్ణయించారు.

ఫ్లోయింగ్ సిల్వర్, ఇల్యూషన్ మిర్రర్, స్టారీ ఒయాసిస్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ చైనాలో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మనదేశంలో కూడా రియల్‌మీ జీటీ సిరీస్ సక్సెస్‌ఫుల్ కాబట్టి త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

రియల్‌మీ జీటీ 5 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.74 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 93.7 శాతంగా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ రన్ కానుంది. 24 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ కూడా అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, ఏ-జీపీఎస్, నావిక్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 12 జీబీ, 16 జీబీ ర్యామ్ ఉన్న వేరియంట్లలో 5240 ఎంఏహెచ్ బ్యాటరీ, 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనున్నాయి. టాప్ ఎండ్ మోడల్ అయిన 24 జీబీ ర్యామ్ వేరియంట్లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 240W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందించారు. దీని మందం 8.9 సెంటీమీటర్లు కాగా, బరువు 205 గ్రాములుగా ఉంది.

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget